Smitha Sabharwal : బిల్కిస్ బానో రేప్ నుంచి మణిపూర్ దాకా `ఐఏఎస్ స్మితా`వార్
తెలంగాణ సీఎం కార్యాలయంలో కీలకంగా ఉన్న ఐఏఎస్ స్మితాసబర్వాల్ (Smitha Sabharwal) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పరిపాలనలోనూ ఆమె సపరేట్.
- By CS Rao Published Date - 05:12 PM, Sat - 22 July 23

తెలంగాణ సీఎం కార్యాలయంలో కీలకంగా ఉన్న ఐఏఎస్ స్మితాసబర్వాల్ (Smitha Sabharwal) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పరిపాలనలోనూ ఆమె సపరేట్. సామాజిక వైఫల్యాలపై నిర్మోహాటంగా ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా మణిపూర్ లో మహిళల్ని వివస్త్రలుగా చేసి, అత్యాచారం చేసిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. నైతికత లేని మెజారిటీ మనోభావాలు మన నాగరికతను నాశనం చేసేలా ఉన్నాయని స్మిత సబర్వాల్ తన ట్వీట్ చేయడం సంచలనం కలిగిస్తోంది. పరోక్షంగా కేంద్రాన్ని ప్రశ్నించేలా ఉన్న ఆమె ట్వీట్ రాష్ట్రపతికి చేరింది. మణిపూర్ ఘటనపై ట్వీట్ చేసిన ఆమె రాష్ట్రపతి ముర్మును టాగ్ చేయడం గమనార్హం. అంతేకాదు, మణిపూర్ ఘటనపై రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కును ఉపయోగించుకుని వాస్తవాలను మీడియా బయటకు తీసుకురావడంలో వైఫల్యం చెందడాన్ని ప్రశ్నించారు.
మణిపూర్ లో మహిళల్ని వివస్త్రలుగా చేసి, అత్యాచారం చేసిన ఘటనపై స్మితా (Smitha Sabharwal )
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, వైఫల్యాలను పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా స్మితాసబర్వాల్ ప్రశ్నిస్తోన్న సందర్భాలు కొన్నింటిని అవలోనం చేసుకోవచ్చు. గత ఏడాది ఆగస్టు 15 సందర్భంగా గుజరాత్‌లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితులకు గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడాన్ని అప్పట్లో స్మిత ప్రశ్నించారు. జైలు నుంచి బయటకొచ్చిన నిందితులకు పూల దండలతో స్వాగత సత్కారాలు పలకడం, మిఠాయిలు తినిపించడం సోషల్ మీడియాలో చూసిన స్మితా సబర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. `వాళ్లకు ఉరితాళ్లే సరి, పూలదండలతో సన్మానాలు కాదు. వారి క్షమాభిక్షను రద్దు చేసి మా నమ్మకాన్ని పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటు రాజ్యాంగ అధిపతులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని స్మితా సబర్వాల్ ఆగస్టు 21న ఆదివారం మరో ట్వీట్ చేశారు.’ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా ఈ వార్తలు చదువుతున్నప్పుడు నమ్మలేకపోయా. భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ బానో హక్కులను హరించి, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేము’ అని స్మితా సబర్వాల్ (Smitha Sabharwal)చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
బిల్కిస్ బానో హక్కులను హరించి, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేము’ అని స్మితా
అప్పట్లో ఆమె చేసిన ట్వీట్ మీద నెటిజన్లు కొందరు ప్రశంసలు కురిపించారు. మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరమని, సివిల్ సర్వీసు నిబంధనలకు విరుద్ధమని తప్పుబట్టారు. కొందరు ఐఏఎస్ అధికారులు అప్పట్లో స్మితను సమర్థించారు మరికొందరు ఐఏఎస్ లు మాత్రం స్మిత సబర్వాల్ గీత దాటారని విమర్శించారు. నెటిజన్ల విమర్శలకు స్మితా సబర్వాల్ ఏమాత్రం చలించడం లేదు. పైగా ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ అధికారుల వాక్ స్వాతంత్య్రాన్ని హరించే సర్వీసు నిబంధనలను రద్దు చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ మరో ట్వీట్ చేయడం గమనార్హం. గుజరాత్ ప్రభుత్వంను బీజేపీ నడిపిస్తోంది. ఆ పార్టీ స్మితను (Smitha Sabharwal) ఏకపారేసింది.
Also Read : Smitha Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు ఎదురుదెబ్బ!
గత ఏడాది దసరా ఉత్సవాల నేపధ్యంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, కానీ స్త్రీ, పురుష నిష్పత్తిలో మాత్రం రాష్ట్రాలలో వేరువేరుగా ఉందని ఆమె పోస్ట్ చేశారు. దీనికి ఆమె ఓ మ్యాప్ జతచేసి ఆసక్తికరంగా ఉందని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. స్మితాసబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళల జనాభా తక్కువగా ఉందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో పాటు ఇండియా మ్యాప్ జత చేశారు. ఆ మ్యాప్ లో కాశ్మీర్ సంపూర్ణ గా కనిపించకపోవడంతో నెటిజన్లు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. `నా ట్వీట్ ఆమోదయోగ్యంగా లేదని మీలో చాలా మంది భావిస్తున్నారని, అందుకు క్షమాపణ చెప్తూ డిలీట్ చేస్తున్నానాని అప్పట్లో ఆమె పేర్కొన్నారు.
History bears witness that women have been hapless trophies in any strife.
The horrific images surfacing after almost 70 days of the gruesome #ManipurViolence where helpless innocent women are being paraded, almost a half lakh people displaced, shakes you to the roots.
What is…— Smita Sabharwal (@SmitaSabharwal) July 20, 2023
అవుట్ లుక్ మ్యాగజైన్ వేసిన ఫోటో అభ్యంతరకరంగా ఉందని స్మితాసబర్వాల్ అప్పట్లో పరువునష్టం దావా వేశారు. అయితే, కోర్టు ఖర్చుల కింద ప్రభుత్వం నుంచి రూ. 15లక్షలు డ్రా చేశారు. ఆ అంశంపై హైకోర్టులో విచారణ జరగ్గా, ఆమెకు చివాట్లు పెట్టింది. పరువునష్టం దావా కేసు వేసేందుకు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం నిధులివ్వడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యక్తి.. ప్రైవేట్ సంస్థపై వేసిన పిటిషన్.. ప్రజా ప్రయోజనం ఎలా అవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వానికి రూ.15 లక్షలను స్మితా సబర్వాల్ తిరిగి ఇచ్చేయాలని.. 90 రోజులు గడువు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇలా,పలు సందర్భాల్లో వివాదాల్లోకి వెళ్లిన స్మిత తాజాగా మణిపూర్ (Smitha Sabharwal) ఇష్యూలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా తప్పుబడుతూ ట్వీట్ చేయడాన్ని బీజేపీ టార్గెట్ చేస్తోంది.