HYD Metro : మెట్రో టైమింగ్స్ లో స్వల్ప మార్పులు..
ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది
- Author : Sudheer
Date : 24-05-2024 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ (Hyderabad Metro) లో స్వల్ప మార్పులు చేసింది యాజమాన్యం. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 AM గంటల నుంచే రైళ్ల రాకపోకలు నిర్వహించేలా.. ట్రయల్ నిర్వహిస్తున్నామని ఇటీవలే అధికారులు ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను మెట్రో యాజమాన్యం ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. తాజాగా, సోమవారం, శుక్రవారాల్లో మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చేయడం గమనార్హం. ప్రస్తుతం నగర వాసులు ఎక్కువగా మెట్రో లలో ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మెట్రో లలో ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో మెట్రో యాజమాన్యం టైమింగ్ విషయంలో స్వల్ప మార్పులు చేసింది.
Read Also : Police Case: కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన ఎస్ఐ సస్పెండ్