Tunnel Boring Machine : సొరంగాలు తునాతునకలు.. టన్నెల్ బోరింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది ? ధర ఎంత ?
సొరంగంలోని మట్టి స్వభావం ఏమిటి ? రాయి ఎంత గట్టిగా ఉంది? నీరు ఊరే శాతం ఎంత ? అనే అంశాల ఆధారంగా వివిధ రకాల టీబీఎం(Tunnel Boring Machine) యంత్రాలను సొరంగం తవ్వకాలకు వినియోగిస్తుంటారు.
- By Pasha Published Date - 06:36 PM, Thu - 27 February 25

Tunnel Boring Machine : తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ). ఈ ప్రాజెక్టులోని టన్నెల్‌లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై అందరి చూపు ఉంది. టన్నెల్‌లో పైకప్పు కూలిన ప్రాంతం నుంచి వందల మీటర్ల వరకు మట్టి, బండరాళ్లు, బురద, నీళ్లు ఉన్నాయి. మార్గం మధ్యలో ఉన్న మట్టిని తవ్వడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకం కోసం ‘డబుల్ షీల్డ్ టీబీఎం’ రకానికి చెందిన టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)ను వాడుతున్నారు. దీని ధర, నిర్వహణ తీరు గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Also Read :Underground Mosque: అండర్ గ్రౌండ్‌లో అద్భుత మసీదు.. అన్య మతస్తులకు మెడిటేషన్ గదులు
టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) విశేషాలివీ..
- ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు ఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్ (జయప్రకాశ్ అసోసియేట్స్) మొదటి నుంచీ కాంట్రాక్టరుగా వ్యవహరిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులోని సొరంగం తవ్వే పనిని 2006 మే 26న అమెరికాకు చెందిన రాబిన్స్ సంస్థకు జేపీ గ్రూపు అప్పగించింది.
- రెండు టీబీఎంలు, కన్వేయర్ బెల్టు, బ్యాకప్ సిస్టం, స్పేర్ పరికరాలు ఇతరత్రా బాధ్యతను రాబిన్స్ సంస్థకే అప్పగించారు.
- టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) భూమిలోపల చెక్కుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. ఈ యంత్రంలో మెషీన్ ముందు వైపు తిరిగే చక్రం ఉంటుంది. దాన్ని కటర్ హెడ్ అంటారు. దీని వెనుక ‘మేరింగ్’ ఉంటుంది. తవ్వకం చేసే క్రమంలో టీబీఎం లోపలికి ప్రవేశించే వ్యర్థాలను పట్టే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.
- సొరంగంలోని మట్టి స్వభావం ఏమిటి ? రాయి ఎంత గట్టిగా ఉంది? నీరు ఊరే శాతం ఎంత ? అనే అంశాల ఆధారంగా వివిధ రకాల టీబీఎం(Tunnel Boring Machine) యంత్రాలను సొరంగం తవ్వకాలకు వినియోగిస్తుంటారు.
- కాంక్రీట్ లైనింగ్, మెయిన్ బీమ్, గ్రిప్పర్, సింగిల్ షీల్డ్, డబుల్ షీల్డ్, ఎర్త్ ప్రెషర్ బాలెన్స్, ఓపెన్ ఫేస్ సాఫ్ట్ గ్రౌండ్ ఇలా చాలా రకాల టీబీఎం యంత్రాలు ఉంటాయి.
- టన్నెల్ బోరింగ్ మెషీన్ ద్వారా తవ్వకాలు చేస్తే చాలా తక్కువ శబ్దాలు వస్తాయి. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ చేయకుండానే ఈ యంత్రంతో సొరంగంలోని మట్టిని తొలగించవచ్చు.
- పరిసరాలు దెబ్బతినకుండా, పనిచేయడం టీబీఎం రకం యంత్రాల ప్రత్యేకత.
- ఎస్‌ఎల్‌బీసీ పనులు చేస్తున్న రాబిన్స్ సంస్థ స్వయంగా టీబీఎం యంత్రాలను తయారు చేస్తుంటుంది. రూ. 43 కోట్ల నుంచి రూ. 850 కోట్ల వరకూ విలువ చేసే టీబీఎం యంత్రాలు ఉంటాయి. వీటిని కొనాలంటే పన్నులు, రవాణా ఖర్చులు అదనంగా చెల్లించాలి.
- ఒక్కో టీబీఎం యంత్రం తయారీకి నెలల నుంచి ఏళ్ల సమయం పడుతుంది.
Also Read :Forceful Layoffs : బలవంతపు ఉద్యోగ కోతలు.. ‘ఇన్ఫోసిస్’పై ప్రధాని ఆఫీసుకు ఫిర్యాదులు
గతంలో డిప్యూటీ సీఎం భట్టి ఏమన్నారంటే..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను నెలకు సగటున 400 మీటర్ల మేర తవ్వితే రూ.14 కోట్లు ఖర్చవుతుందని, దాన్ని చెల్లించడానికి తాము సిద్ధమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక సందర్భంలో వెల్లడించారు. దీన్నిబట్టి ఈ యంత్రాలతో పనులు చేయిస్తే అయ్యే ఖర్చును మనం అంచనా వేసుకోవచ్చు.