SIT RRR : ఇప్పుడు వద్దులే…అవసరమైనప్పుడు పిలుస్తాం…అప్పుడు రండి…!!
- By hashtagu Published Date - 09:29 AM, Tue - 29 November 22
ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించిన ఇవాళ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సిట్ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఇవాళ విచారణకు రావద్దంటూ ఆర్ఆర్ఆర్ కు సిట్ ఈ మెయిల్ ద్వారా మెసేజ్ పంపించింది. మళ్లీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం…అప్పుడు రండి అంటూ సిట్ తెలిపింది. రఘురామకు మూడు రోజుల క్రితం సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం పది గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ సిట్ కార్యాలయంలో హాజరుకావాలని తెలిపింది. కాగా నిందితులతో కలిసి రఘురామ ఉన్న ఫోటోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. ఏ1,ఏ2లకు రఘురామాతో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన సిట్…41ఏ నోటీసులు అందుకున్న నలుగురిని ఈ జాబితాలో చేర్చింది. సిట్ ముందుకు హాజరుకాకుంటే అరెస్టు తప్పదని తెలిపింది. కానీ ఇవాళ మాత్రం రఘురామ సిట్ ముందు హాజరుకావడం లేదు.