Raksha Bandhan : సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి
కోదాడలో డిప్లొమా చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో ఆకతాయుల వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది
- Author : Sudheer
Date : 19-08-2024 - 1:10 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ వ్యాప్తంగా రాఖీ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే ‘రాఖీ పౌర్ణమిని’ దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాదిలో మాత్రమే ఈ పండగను ఎక్కువగా జరుపుకుంటూనేవారు. కానీ కాలక్రమేణా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు జరుపుకుంటూ వస్తున్నారు. తోబుట్టువులతో ప్రేమగా మెలగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలని ఈ పండగ సూచిస్తుంది. అలాంటి గొప్ప పండగ రోజు ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.
మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో హాస్పిటల్‌లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు రాఖీ కట్టి కన్నుమూసింది. ఈ ఘటన తో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఓ యువతి(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యలు చికిత్స కోసం మహబూబాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రాఖీ వరకు ఉంటానో లేదోనని భావించి శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల వ్యవధిలో తుదిశ్వాస విడిచింది. కళ్ల ముందే తమ కూతరు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి
కోదాడలో డిప్లొమా చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో ఆకతాయుల వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది.
ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్న తను రాఖీ పండగ నాటికి ప్రాణాలతో ఉంటానో లేదో అన్న బాధతో… https://t.co/rO3YBqqo8O pic.twitter.com/k5LMWuJHi4
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
Read Also : Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ షేర్ రేటు డబుల్.. స్టాక్ మార్కెట్లో దూకుడు