Praja Palana : ప్రస్తుత పెన్షన్ దారులు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలా..?
- Author : Sudheer
Date : 27-12-2023 - 1:55 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) చేపట్టబోతున్న ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ఫై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు (Congress 6 Guarantees apply Form) సంబదించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించబోతున్నారు. అయితే ఈ దరఖాస్తుల ఫై అనేక రకాలుగా మాట్లాడుతుండడంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం రేపటి నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని..జనవరి 06 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెపుతుండడం తో ఎవరెవరు అప్లై చేసుకోవాలి..ఏ ఏ పథకాలకు అప్లై చేసుకోవాలి..రేషన్ కార్డు దారులే చేసుకోవాలా..? రేషన్ కార్డు లేని వారు చేసుకోవచ్చలేదా..? రైతుబంధు ఉన్న వారు మళ్లీ అప్లై చేసుకోవాలా..? ముఖ్యంగా పెన్షన్ దారులు అప్లై చేసుకోవచ్చా..? లేదా..? ప్రస్తుతం తీసుకున్న వారు మాత్రమే చేసుకోవాలా..? కొత్త పెన్షన్ దారులు కూడా చేసుకోవచ్చా..? లేదా..? ఇలా అనేక ప్రశ్నలు ప్రజలను తికమక పెట్టిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ప్రభుత్వం కూడా దీనిపై ప్రజల్లో పూర్తి అవహగానా కల్పించడం లో విఫలం అవుతుంది. గ్రామ సభ పెట్టి దరఖాస్తులు పంచుతామని..ఆ తర్వాత వాటిని నింపి మళ్లీ అధికారులకు ఇవ్వాలని చెపుతుండడం తో ఇంకాస్త అయోమయానికి గురి అవుతున్నారు. చేయూత పథకం కింద రూ.4000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ పొందాలంటే రేపటినుంచే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు, ప్రజా భవన్‌లో ఇప్పటికే అప్లై చేసిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. పెన్షన్ రాని అర్హులు మాత్రం తప్పనిసరి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏది ఏమైనప్పటికి ప్రభుత్వం హడావిడిగా కాకుండా కాస్త అలోచించి..అందరికి రేషన్ కార్డ్స్ ముందుగా ఇచ్చి ఈ కార్యక్రమం చేపడితే బాగుండని అంత అంటున్నారు.
Read Also : America Road Accident : వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి