HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Shooting At A Jewelry Shop In Karimnagar

Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!

ఈ భారీ దోపిడీ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం వేట సాగిస్తున్నాయి. జిల్లా సరిహద్దులతో పాటు రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా నాకాబందీ నిర్వహించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు

  • Author : Sudheer Date : 03-05-2026 - 5:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shooting At A Jewelry Shop
Shooting At A Jewelry Shop

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో ఉన్న పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌లో ఆదివారం ఉదయం భీభత్సం చోటుచేసుకుంది. ఉదయం 10:45 గంటల సమయంలో సిబ్బంది షోరూమ్‌ను తెరిచి, లాకర్ల నుంచి విలువైన బంగారు ఆభరణాలను డిస్‌ప్లేలో సర్దుతున్న తరుణంలో ఈ దాడులు జరిగాయి. రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు దుండగులు తుపాకులతో లోపలికి చొరబడ్డారు. సిబ్బంది ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, ముష్కరులు ఏకంగా 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారు. ఈ కాల్పుల్లో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల అనంతరం కిలోల కొద్దీ బంగారాన్ని బ్యాగుల్లో నింపుకుని దుండగులు పరారయ్యారు.

అంతర్రాష్ట్ర ముఠా పనేనా? పోలీసుల ముమ్మర గాలింపు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని షోరూమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలంలో లభించిన బుల్లెట్ షెల్స్, తుపాకీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారైన మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుండగుల మాటతీరు, ఆయుధాలు వాడిన తీరును బట్టి ఇది ఉత్తరాదికి చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పని అయి ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. వీరు చాలా రోజులుగా నగరంలోనే ఉండి ‘రెక్కీ’ నిర్వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

హై అలర్ట్.. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు

ఈ భారీ దోపిడీ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం వేట సాగిస్తున్నాయి. జిల్లా సరిహద్దులతో పాటు రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా నాకాబందీ నిర్వహించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంబడి ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా బైక్‌లపై వెళ్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. పట్టపగలు, రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం పోలీసుల భద్రతా వ్యవస్థకు సవాలుగా మారింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BreakingNewsTelugu
  • crimenews
  • JewelleryRobbery
  • karimnagar
  • KarimnagarPolice
  • KarimnagarRobbery
  • PMJJewels
  • TelanganaCrime

Related News

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd