Telangana High Court: కేసీఆర్ కు షాక్.. బీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులు
పదకొండు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
- Author : Balu J
Date : 18-07-2023 - 3:01 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం కొన్ని చోట్లా స్థలాలు కేటాయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో అధికార భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి పదకొండు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్ఎస్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు విచారించింది. ఎకరం రూ.50 కోట్లు పలుకుతున్న భూమిని కేవలం రూ.3.41 కోట్లకే బీఆర్ఎస్ కు కేటాయించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా భూకేటాయింపుకు సంబంధించిన పత్రాలన్నింటినీ రహస్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఆగస్ట్ 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టయింది.
Also Read: Food Poisoning: ఎగ్ బిర్యానీ తిని 32 మంది విద్యార్థినులకు అస్వస్థత