Sheshadri : సీఎం రేవంత్ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియామకం
తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డిని, సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వి.శేషాద్రిని నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు
- By Sudheer Published Date - 03:43 PM, Thu - 7 December 23

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో పదేళ్లుగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను మార్చేపనిలో పడింది. ఇప్పటికే పలువురిపై వేటు పడనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డిని, సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వి.శేషాద్రిని నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి..ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అలాగే దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ అపాయింట్ మెంట్ ఆర్డర్ అందజేసి, ఆమె ఉద్యోగం ఇచ్చే ఫైల్ పై రెండో సంతకం చేశారు. ప్రమాణస్వీకార వేదికపైనే రజినీకి ఉద్యోగ నియామక పత్రం అందించారు.
అనంతరం మాట్లాడుతూ..త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. కానీ దశాబ్ద కాలంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు గరైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. భుజాలు కాయలు కాచేలా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధమయ్యారని.. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలను గండెల్లో పెట్టుకుంటామన్నారు. వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
4 కోట్ల ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైందన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరుగుందని భరోసా ఇచ్చారు. ప్రగతి భవన్ చుట్టూ పెట్టిన ఇనుప కంచెలు బద్దలు కొట్టించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నానని.. ఇకపై ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ లోకి రావచ్చని ఆహ్వానించారు. తమ ఆకాంక్షలను పంచుకోవచ్చని తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు.
Read Also : Telangana : ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఇవే..