Shad Nagar MLA : బడ్జెట్ కాపీతో పండ్లలో పాసును తీసుకుంటున్న షాద్ నగర్ ఎమ్మెల్యే
- Author : Sudheer
Date : 15-02-2024 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే లు ఎంతో బాధ్యతగా ఉండాలి..సమావేశాల్లో ఏంజరుగుతుంది..ఏమాట్లాడుతున్నారు..ఏ చర్చ నడుస్తుంది..దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి..ఈ బడ్జెట్ ద్వారా ఎంత లాభం ఉంటుంది..ప్రజలు ఏమేమి చేయొచ్చు..నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుంది..ఇలా ఎన్నో వాటి గురించి ఆలోచన చేయాలి…కానీ చాలామంది నేతలు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నిద్ర పోవడం , ఫోన్లలో వీడియోలు చూడడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం వంటివి చేస్తూ..తమకు బడ్జెట్ కు సంబంధం లేదు..అంత అవ్వగానే మనకో ఓ కాపీ ఇస్తారు..అది చూసి చదువుకొని ఆ తర్వాత మనకు వచ్చే నిధులను బట్టి ఆలోచించవచ్చని అనుకుంటారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా బడ్జెట్ కాపీతో పండ్లలో పాసును తీసుకుంటూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
గత ఐదు రోజులుగా బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గత పాలనలో జరిగిన అవకతవకలపై చర్చ నడుస్తుంది. అలాగే మీడీయాగడ్డ బ్యారేజ్ కుంగడం ఫై కూడా పెద్ద రగడే నడుస్తుంది. ఈ క్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే బడ్జెట్ కాపీతో పండ్లలో పాసును తీసుకుంటున్న కనిపించాడు. ఓ పక్క మంత్రి శ్రీధర్ బాబు ఎంతో చక్కగా బడ్జెట్ గురించి మాట్లాడుతుంటే..దానిని ఏమాత్రం పట్టించుకోకుండా షాద్ నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్య..బడ్జెట్ కాపీతో పండ్లలో పాసును తీసుకుంటూ మీడియా లో వైరల్ గా మారారు. దీనిపై బిఆర్ఎస్ శ్రేణులతో పాటు నెటిజనులు మండిపడుతున్నారు.
బడ్జెట్ కాపీతో పండ్లలో పాసును తీసుకుంటున్న షాద్ నగర్ ఎమ్మెల్యే #Telangana #Hyderabad
— BhuvanagiriNaveen_BRS (@NKB_BRS) February 14, 2024
Read Also : Ganta : జగన్ పుణ్యమా అని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందిః గంటా