TS High Court: హైకోర్టు సంచలన తీర్పు, కొత్తగూడెం ఎమ్మెల్యే పై అనర్హత వేటు
ఎన్నికల ముందు అధికార పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.
- Author : Balu J
Date : 25-07-2023 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల ముందు అధికార పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే భూముల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయగా, తాజాగా మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారనే అభియోగాలపై విచారణ కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు పై అనర్హత వేటు వేసింది. 2018 లో వనమా వెంకటేశ్వర్ రావు గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టును జలగం ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని జలగం వెంకట్రావ్ పిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో జలగం ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు సమగ్ర విచారణ చేపట్టింది. అనేక కోణాల్లో చర్చించి వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ను ఇచ్చింది. సమీప అభ్యర్ధిగా జలగం వెంకటరావును విజేత గా ప్రకటించింది. ఎన్నికల కమీషన్ కు తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు గాను వనమా కు రూ 5 లక్షల జరిమానా, 2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యే గా అర్హుడు కాదని సంచలన తీర్పును ఇచ్చింది. 2018 ఎన్నికలలో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వనమా.. ఆ తర్వాత బీఆర్ఎస్ (టీఆరెస్) లో చేరారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టయింది.
Also Read: Rail Restaurant: హైదరాబాద్ లో రైలు రెస్టారెంట్, వెరైటీ వంటకాలతో వెల్ కం!