సజ్జనార్ మరో నిర్ణయం.. చిల్లర కష్టాలకు చెక్!
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ అనూహ్యమైన నిర్ణయాలు, ఆలోచనలను అమలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పలు బస్ డిపోలను క్షుణంగా పరిశీలించారు.
- By Balu J Published Date - 05:44 PM, Tue - 26 October 21

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ అనూహ్యమైన నిర్ణయాలు, ఆలోచనలను అమలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పలు బస్ డిపోలను క్షుణంగా పరిశీలించారు. మూత్రశాలలు, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతిరోజు శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత బస్సులపై అసభ్యకరమైన పోస్టర్లు అతికించకుండా హెచ్చరికలు జారీ చేశారు.
RTC ప్రయాణం సురక్షితం,సులభం
డబ్బులు ఎవరికి ఊరికే రావు…Thank you sir… @tsrtcmdoffice https://t.co/RZzhkdycg8
— HEMA NIDADHANA (@HemaJourno) October 26, 2021
కనీసం 30 మంది ప్రయాణికులు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే నేరుగా బస్సునే కాలనీకి పంపించేలా చర్యలు తీసుకున్నారు. ‘ప్రయాణికులను ఎక్కించుకునేందుకు రోడ్ల మధ్యలో ఆర్టీసీ బస్సులు ఆపటం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్ల నుంచి వసూలు చేయటమే కాదు, క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోవాల్సి వస్తుంది’ అని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
#Ayyayo #Vaddama అయ్యయ్యో వద్దమ్మా డబ్బుల కోసం #ATM చుట్టూ తిరగాల్సిన పనిలేదు #UPI ద్వారా మీ పేమెంట్లు చెల్లించి టికెట్, పార్సల్ మరియు బస్ పాస్ #Buspass పొందగలరు సుఖీభవ! సుఖీభవ!!@puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ pic.twitter.com/BIcK50xWk3
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 25, 2021
అయితే ఆర్టీసీ బస్సుల్లో అటు ప్రయాణికులు, ఇటు కండక్టర్లకు చిల్లర లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ సరికొత్త ఉపాయం తీసుకొచ్చారు. యూపీఐ పద్దతిలో ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చని తెలిపారు. ఈ నిర్ణయంతో చాలామంది ప్రయాణికులకు చిల్లర కష్టాలు తప్పనున్నాయి.
శుభకార్యాలకు సురక్షిత ప్రయాణం #TSRTC. ఎటువంటి అడ్వాన్సు లేకుండా మీ వివాహాది శుభకార్యాలకు మన #TSRTC బస్సు బుక్ చేసుకోవచ్చు. వివరాలకు సమీప డిపో మేనేజర్ ను లేదా మా @TSRTCHQ కాల్ సెంటర్ 040-30102829 & 040-68153333 ను సంప్రదించండి.@tsrtcmdoffice@puvvada_ajay @Govardhan_MLA pic.twitter.com/69hOfRkqxw
— TSRTC (@TSRTCHQ) October 25, 2021
Related News

APSRTC : నెల్లూరులో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికుల దాడి.. కారణం ఇదే..?
నెల్లూరులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ప్రయాణికులు దాడి చేశారు. నెల్లూరు జిల్లా వాసిలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.