CM Revanth : రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం..
CM Revanth : ఈరోజు శనివారం నిర్వహించే సదర్ సమ్మేళనం (buffalo carnival celebrated annually )లో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పేరొందిన దున్నపోతులు (Buffalo Carnival ) నగరానికి చేరకున్నాయి
- By Sudheer Published Date - 04:23 PM, Sat - 2 November 24

యాదవులకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) గుడ్ న్యూస్ తెలిపింది. యదవులు ఘనంగా జరుపుకునే సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు శనివారం స్టేట్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనాన్ని ప్రతి ఏడాది నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశాలు అందించారు. ప్రతి ఏటా హైదరాబాద్ (Hyderabad) నగరంలో యాదవులు సదర్ సమ్మేళనం (Sadar Sammelan) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారనే సంగతి తెలిసిందే.
ఈరోజు శనివారం నిర్వహించే సదర్ సమ్మేళనం (buffalo carnival celebrated annually )లో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పేరొందిన దున్నపోతులు (Buffalo Carnival ) నగరానికి చేరకున్నాయి. హర్యానాకు చెందిన ఏడడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుతో ఉండే ‘గోలు 2’ అనే దున్నపోతు అందరి దృష్టిని ఆకర్షించేందుకు సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లోని దున్నరాజులు కూడా సదర్‌లో తమ విన్యాసాలను చూపనున్నాయి. సదర్ సమ్మేళనం దృష్ట్యా నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.
Read Also : Kartika Vana Bhojanalu: వన భోజనాలు అంటే ఏమిటి? కార్తీక మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు?