HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sacrifice Your Seat For Women In This Election Itself Sharmila Counter To Ktr

Sharmila: చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్నికల్లోనే మీ సీటును త్యాగం చేయండి: కేటీఆర్ కు షర్మిల పంచ్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు సంధించారు.

  • Author : Balu J Date : 20-09-2023 - 5:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR vs Sharmila
KTR vs Sharmila

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై విరుచుకు పడ్డారు. తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సూటీగా ప్రశ్నించారు. ‘‘మహిళా రిజర్వేషన్లతో తన సీటు కోల్పోయినా సిద్ధమే అని చెప్పే కేటీఆర్ గారు.. బిల్లు అమలయ్యేదాక ఎదురుచూడటం ఎందుకు? ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండి.. మిమ్మల్ని అడ్డుకునేదెవరు.. నిజంగా మహిళల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే.. మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు మీ పోరాట ఫలితమే అయితే.. ఈ ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట వేయండి మీ సీటు మహిళకు ఇవ్వండి.

మీ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించండి. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపండి. మహిళలను దారుణంగా అవమానించిన మీరే ఈరోజు మహిళల గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. నిరుద్యోగుల కోసం మేం దీక్షలు చేస్తే వ్రతాలంటూ ఎద్దేవా చేసింది మీరే.. మహిళా మంత్రులు లేకుండా చేసింది మీరే.. మహిళా కమీషన్ ఉందన్న సంగతే మర్చిపోయారు’’ అని షర్మిల విరుచుకుపడింది.

‘‘ శ్రీకాంత చారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవి ఇవ్వలేదు.. మీ చెల్లి కవితమ్మ ఓడిపోతే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారు. మీకున్నది మహిళల మీద ప్రేమ కాదు.. మీ కుటుంబం మీద ప్రేమ.. మీకు సామాన్య ప్రజల్ని ప్రేమించే సత్తాలేదు. మాటలతో చిత్తశుద్ధి నిరూపణ కాదు.. చేతలతోనే అవుతుంది. 119 నియోజకవర్గాల్లో 63 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువని ఎన్నికల సంఘం చెప్తోంది. 33 శాతం లెక్కన ఈ ఎన్నికల్లో మీరిచ్చిన 7 సీట్లతో పాటు మరో 32 సీట్లు ఇవ్వండి. గజ్వేల్ ,సిద్దిపేట,సిరిసిల్లలో మహిళల ఓట్లే అధికం కాబట్టి దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయండి. అప్పుడు నమ్ముతాం మహిళా బిల్లు మీ పోరాట ఫలితమేనని..! మహిళల పట్ల మీకు ఎంతో చిత్తశుద్ధి ఉందని..! మీవి అవకాశవాద రాజకీయాలు కాదని..! దమ్ముంటే కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించాలి’’ అని షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Also Read: BRS: గులాబీ గూటికి సీతారాంపురం గ్రామ మిత్ర యూత్ నాయకులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • ktr
  • sharmila
  • Women Reservation Bill

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd