Rythu Bandhu Scheme : రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్..?
- By Sudheer Published Date - 11:20 AM, Wed - 27 December 23

గత ప్రభుత్వం (BRS) రైతుల కోసం రైతుబంధు పథకాన్ని (Rythu Bandhu ) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రవేశ పెట్టారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా రైతులకు అందజేసింది. అలాంటి ఈ పథకానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రేషన్ కార్డు (Ration Card) తో ముడిపెట్టింది.
గతంలో మాదిరిగా రైతుబంధు కింద పెట్టుబడి సహాయం పొందాలంటే లబ్దిదారులకు రేషన్ కార్డు ఉండాల్సిందే. గతంలో రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే రైతుబంధు సహాయం అందేది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతు బంధుకు రేషన్ కార్డును లింక్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో ప్రతి ఏటా ఎకరానికి రూ. 15 వేలను ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే రేపటి నుండి గ్రామ సభల్లో రైతులు ఈ పథకం కోసం ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారే ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోనేందుకు వీలుంది. రైతు బంధు పథకానికి రేషన్ కార్డును లింక్ నిబంధన పెట్టడంతో సుమారు 70 లక్షల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం వాస్తవమేనా, లేదా అనేది స్పష్టత కావాల్సి ఉంది. అదే నిజమైతే రైతు బంధు లబ్దిదారులకు ఇబ్బందులు తప్పవు.

Rythu Bandhu Ration Card Li

Rythu Bandhu Ration Card

Rythu Bandhu Ration
Read Also : Praja Palana Application Form : ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఇదే…ఈ ఫామ్ ఎలా నింపాలంటే..!!