Runamafi 3rd Phase : రేపు మూడో విడత రుణమాఫీ ప్రారంభం
జులై 18న మొదటి విడతలో భాగంగా రూ. లక్ష లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అదే నెల 30న లక్షన్నర రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది
- By Sudheer Published Date - 09:21 AM, Wed - 14 August 24
తెలంగాణ రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది రేవంత్ సర్కార్ (Congress Govt). ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ (RunaMafi ) ని విడతల వారీగా మాఫీ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల్లో రూ. .1.50 లక్షల లోపు మాఫీ చేయగా..రేపు మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా.
We’re now on WhatsApp. Click to Join.
జులై 18న మొదటి విడతలో భాగంగా రూ. లక్ష లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అదే నెల 30న లక్షన్నర రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇలా 12 రోజుల వ్యవధిలోనే మొత్తం 17.55 లక్షల మంది రైతులకు రూ. 12 వేల కోట్లకుపైగా రుణాలు మాఫీ చేయడం తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు తుది విడతలో 14.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.
కాగా రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మంగళవారంతో ముగిసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన బృందం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు బృందం అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. వారం రోజుల పాటు అక్కడున్న ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇన్వేస్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పాలసీని వారికి వివరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా దక్షిణ కొరియాలోను వారి పర్యటన కొనసాగింది. పర్యటనలో భాగంగా మొత్తం రూ.31 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో సీఎం రేవంత్ బృందం సక్సెస్ అయింది. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో వైరా చేరుకుంటారు. అక్కడ ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటిస్తారు.
Read Also : AP Govt : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసిన కూటమి సర్కార్