TSRTC Workers Strike : రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె
TSRTC Workers Strike : సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం సహా మొత్తం 21 సమస్యలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె తప్పదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 10:32 AM, Tue - 6 May 25

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండుతో జేఏసీ (సంయుక్త కార్యాచరణ సమితి) బుధవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం సహా మొత్తం 21 సమస్యలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె తప్పదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సన్నాహక చర్యలు చేపట్టిన జేఏసీ, ఉద్యోగులను సమ్మెలో పాల్గొనాలంటూ ఉద్ఘాటన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
J & K : కశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాద సహచరుల అరెస్టు
మరోవైపు, ప్రభుత్వం మాత్రం సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటూ, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలు ఆర్టీసీ యూనియన్ నేతలతో సమావేశమై, ఉద్యోగుల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. రూ.400 కోట్ల బాండ్ చెల్లింపులు, రూ.1039 కోట్ల పీఎఫ్ ఆర్టీనైజేషన్, కొత్తగా 3038 ఉద్యోగాల భర్తీ, తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాల్టీగా అభివృద్ధి చేయడం వంటివి ప్రభుత్వం చేసిన ముఖ్యమైన అభివృద్ధి చర్యలని పేర్కొన్నారు.
War Plan : యుద్ధ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష.. పాక్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?
అయినప్పటికీ జేఏసీ మాత్రం ఎలాంటి వెనుకంజ లేదంటూ సమ్మె యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మాత్రం సమ్మెకు దూరంగా ఉంటామని ప్రకటించారు. అయితే జేఏసీ చైర్మన్ వెంకన్న అశ్వత్థామపై తీవ్ర విమర్శలు చేస్తూ, 2019లో కేసీఆర్‌తో ఒప్పందం చేసుకుని కార్మికులను మోసం చేశాడంటూ ఆరోపణలు గుప్పించారు. ఆర్టీసీ యాజమాన్యం ఎస్మా చట్టం ప్రయోగం హెచ్చరికలు జారీ చేయడంతో సమ్మె మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు బస్‌భవన్ వరకు కవాతు నిర్వహించారు. ఈ నేపథ్యంలో, సమ్మెపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, జేఏసీ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.