HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rs 31532 Crore Investments For Telangana Cm Revanths Visit To America Was A Success

CM Revanth : తెలంగాణకు రూ.31,532 కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన సక్సెస్

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి  ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో  గూగుల్ కంపెనీకి చెందిన వేమో (Waymo) డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించారు.

  • By Pasha Published Date - 07:18 AM, Mon - 12 August 24
  • daily-hunt
Cm Revanth Us Tour

CM Revanth : అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి  ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో  గూగుల్ కంపెనీకి చెందిన వేమో (Waymo) డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు నడుస్తుండటాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. వేమో కారులో తెలంగాణ మంత్రి డి.శ్రీధర్ బాబు కూడా ప్రయాణించి, దానిలో జర్నీ ఎలా ఉందనే విషయాన్ని ప్రత్యక్షంగా చూశారు.

We’re now on WhatsApp. Click to Join

సీఎం రేవంత్  రెడ్డి (CM Revanth)  అమెరికా పర్యటన విజయవంతమైంది. ఈ పర్యటనలో తెలంగాణ కోసం రూ.31532 కోట్ల పెట్టుబడులను సాధించగలిగారు. దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో 30750 కొత్త ఉద్యోగాల కల్పన జరగనుంది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించడం, హైదరాబాద్‌ను 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్న వివిధ ప్రాజెక్టుల గురించి తెలుసుకొని అమెరికా కంపెనీలు ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.  సీఎం రేవంత్ రెడ్డి,  మంత్రి శ్రీధర్ బాబుతో కూడిన ప్రభుత్వ అధికారుల బృందం ఈనెల 3న అమెరికా పర్యటనకు బయలుదేరింది. అప్పటి నుంచి సీఎం సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్‌లలో పాల్గొంది.

Also Read :Varalakshmi Vratham 2024: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తిని చూపాయి. కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్‌, అమెజాన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి బృందం ఈ పర్యటనలో భాగంగా యాపిల్ కంపెనీ, గూగుల్ కంపెనీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.

Also Read :Gobi Manchuriya: గోబీ మంచూరియా అంటే ఇష్టమా.. ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

శనివారం అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ దక్షిణ కొరియాకు బయలుదేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు జరిపి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికింది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించింది. తెలంగాణ అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకం’’ అని పేర్కొన్నారు. అమెరికా వ్యాపార సామ్రాజ్యాలకు తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటిచెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • cm revanth
  • telangana
  • US Investments
  • US tour

Related News

It was the Congress government that turned SCs and STs into rulers: CM Revanth Reddy

Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

Congress : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, రాబోయే ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది

  • Private Colleges

    Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Hyd Real Estate

    Hyderabad : హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే – సీఎం రేవంత్

  • CM Revanth

    KTR & Kishan Reddy : కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ – సీఎం రేవంత్

  • Inspections Brs

    Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత

Latest News

  • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

  • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

  • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

Trending News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd