RS 1 Biryani: రూ.1కే చికెన్ ధమ్ బిర్యానీ
తెలంగాణ బిర్యానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా పేమస్. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవ్వరైనా లొట్టలేసుకుని లాగించేయాల్సిందే. ఇక్కడ బిర్యానీ పెద్ద కాస్ట్ కూడా కాకపోవడంతో జనాలు బిర్యానీని తెగ తినేస్తుంటారు.
- By Praveen Aluthuru Published Date - 06:37 PM, Sat - 17 June 23

RS 1 Biryani: తెలంగాణ బిర్యానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా పేమస్. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవ్వరైనా లొట్టలేసుకుని లాగించేయాల్సిందే. ఇక్కడ బిర్యానీ పెద్ద కాస్ట్ కూడా కాకపోవడంతో జనాలు బిర్యానీని తెగ తినేస్తుంటారు. అయితే బిర్యానీ కాస్ట్ మహా అయితే రూ.150 లేదా రూ.200 అంతకంటే 300 ఉంటుంది. కానీ బిర్యానీ 1 రూపాయికే వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? 1 రూపాయికి బిర్యానీలో వేసే ఆకులు కూడా రావు కదా అనుకుంటున్నారా. అవును బిర్యానీ కేవలం ఒక రూపాయి మాత్రమే. ఎక్కడో తెలుసా.. తెలంగాణలోని కరీంనగర్లో బిర్యానీ కేవలం 1 రూపాయి మాత్రమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా… ఇదే నిజం.
కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో రూ.1కే బిర్యానీ వస్తుండటంతో పట్టణ ప్రాంతంలోని ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. తెలంగాణ చౌక్ సమీపంలో ఉన్న ఎంపైర్ హోటల్ యాజమాన్యం రూ.1 కే బిర్యానీ అందజేస్తామని, అయితే ఒకరికి ఒక బిర్యానీ మాత్రమే ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతున్నారు. ఇక దీనికి సంబంధిం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం కావడంతో 1 రూపాయి బిర్యానీ పేమస్ అయిపోయింది. అసలే తెలంగాణాలో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే ఎండల్ని సైతం లెక్కచేయకుండా బిర్యానీ లవర్స్ క్యూ కట్టేస్తున్నారు.
Rs.1 #biryani offer creates flutter in #Karimnagar, despite the scorching sun, a huge number of people gathered, on Saturday.
The Empire Hotel was promised to provide biryani, who brought ₹ 1 note and only one biryani per head, as its opening offer.#Telangana #BiryaniRs1 pic.twitter.com/fcBGj4x7Ym— Surya Reddy (@jsuryareddy) June 17, 2023
1 రూపాయికే బిర్యానీ దొరుకుతుండటంతో జనాలు పెద్ద ఎత్తున సదరు హోటల్ కి చేరుకుంటున్నారు. దీంతో వాహనాలను ప్రధాన రహదారిపై అడ్డంగా పార్కింగ్ చేయడంతో సమస్యగా మారుతుంది. టాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. ఈ క్రమంలో పోలీసులు వచ్చి పరిస్థితిని సక్కదిద్దారు. మరోవైపు పోలీసులు రెస్టారెంట్ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశారు.
గమనిక: ఒక రూపాయి నోట్ మాత్రమే తీసుకొనడును
Read More: Odisha Train Accident: రైలు ప్రమాదంలో 291కి చేరిన మృతుల సంఖ్య