TS : ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం…4గురు దుర్మరణం..!!
- By hashtagu Published Date - 08:03 AM, Mon - 31 October 22

ఆదిలాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు కారులో వెళ్తున్నారు. గుడిహత్నూర్ మండలం సీతాగొంది సమీపంలో కంటైనర్ వెనక నుంచి కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ మరణించింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లారీ వెనక ఇరుకున్న డెడ్ బాడీలను క్రేన్స్ సాయంతో బయటకు తీశారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో ఆదిలాబాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.