RG Kar Doctor Death: ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం ఆపై హత్య.. కేటీఆర్ స్పందన ఇదే..!
ఈ స్థాయిలో క్రూరత్వాన్ని అస్సలు భరించలేం. ఈ ప్రాణహీన ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదు. మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాను అని కేటీఆర్ అన్నారు.
- By Gopichand Published Date - 02:08 PM, Mon - 12 August 24

RG Kar Doctor Death: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో 31 ఏండ్ల ట్రైనీ డాక్టర్‌పై ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన అత్యాచారం ఆపై హత్య (RG Kar Doctor Death) కలచివేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేశారు.
“ఈ స్థాయిలో క్రూరత్వాన్ని అస్సలు భరించలేం. ఈ ప్రాణహీన ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదు. మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాను” అని కేటీఆర్ అన్నారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న వైద్యులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. “దవాఖానలో వైద్యులు సురక్షితంగా ఉండలేకపోతే, మన ఆడపిల్లలు ఎక్కడైనా క్షేమంగా ఉంటారా?” అని ఆయన ప్రశ్నించారు.
Also Read: Shashi Tharoor : హసీనాకు భారత్ ఆశ్రయం..శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో 28 ఏండ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్ బాధితురాలి హత్య జరిగిన సెమినార్ రూమ్‌లో దొరికింది. అదే అతడిని పట్టుకునే ఆధారం అయింది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు అతడి మెడలో బ్లూటూత్ డివైజ్ ఉంది.
The alleged rape and murder of a 31 year old doctor while on duty at RG Kar Medical College, Kolkata in the hospital premises is shocking
My heart goes out to the victim’s parents, family and friends. No one should have to endure this. And no one who has resorted to such…
— KTR (@KTRBRS) August 12, 2024
40 నిమిషాల అనంతరం బయటకు వచ్చినప్పుడు అది అతడి మెడలో లేదు. కొంతసేపు పెనుగులాట తర్వాత నిందితుడు డాక్టర్‌ను గొంతు పిసికి చంపినట్టు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని సంజయ్ రాయ్‌కు నాలుగుసార్లు పెండ్లిళ్లు జరిగినప్పటికీ అతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతడిని వదిలి వెళ్లిపోయాయని, నాలుగో భార్య గత ఏడాది మరణించినట్లు పోలీసులు తెలిపారు. సంజయ్ రాయ్ పోలీస్ పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.