KTR : కేసీఆర్ గవర్నర్ కాదు..త్వరలోనే రేవంత్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు – కేటీఆర్
బీఆర్‌ఎస్ బిజెపి లో విలీనం , కేసీఆర్ గవర్నర్ కాదు సీఎం రేవంత్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని సెటైర్లు వేసాడు
- By Sudheer Published Date - 07:57 PM, Fri - 16 August 24

తెలంగాణ (Telangana) రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అమలు చేస్తున్న హామీలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా..బిఆర్ఎస్ మాత్రం ఆరోపణలు , విమర్శలు చేస్తూ వస్తుంది. తాజాగా కాంగ్రెస్ మూడో విడత రుణమాఫీ చేసి సంబరాలు చేసుకుంటుంటే..బిఆర్ఎస్ మాత్రం రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని..విమర్శలకు దిగింది. ఇది ఇలా ఉండగానే తాజాగా సీఎం రేవంత్ ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో కేసీఆర్ , కేటీఆర్ లపై కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్‌ఎస్ త్వరలోనే విలీనం అవుతుందని, ఆ వెంటనే కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రి, కవిత ఎంపీ కాబోతున్నారని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్‌ఎస్ బిజెపి లో విలీనం , కేసీఆర్ గవర్నర్ కాదు సీఎం రేవంత్ అమెరికా అధ్యక్షుడు (Revanth US President) కాబోతున్నాడని సెటైర్లు వేసాడు. రేవంత్ రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మనోడు అమెరికా అధ్యక్షుడు అయితడని.. మొన్ననే కేజీఎఫ్‌లో ఏదో మీటింగ్ పెట్టి ఆయనెవరో చెప్పారు కదా.. ఈయనే అయితడేమో మరి’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ట్రంప్ సరిపోతలేడని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమో అని వెటకారంగా అన్నారు. మాకు రాజీనామాలు కొత్త కాదు.. రేవంత్ రెడ్డికి మోసాలు కొత్త కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు.
Read Also : 24 Hours Strike: అలర్ట్.. రేపు, ఎల్లుండి ఆ సేవలు బంద్..!