Revanth hard comments: ప్రగతి భవన్‌ను పేల్చివేయాలి!
పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- By Balu J Published Date - 09:43 AM, Wed - 8 February 23

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోమారు కల్వకుంట్ల ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. ములుగు (Mulugu) అడ్డాలో పాదయాత్ర చేస్తున్న ఆయన ప్రగతి భవన్ (Pragathi Bhavan) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఎకరాల్లో 110 గదులతో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి నిర్మించిన ప్రగతి భవన్ ఆంధ్రా పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచి, స్వాగతం పలుకుతోందన్నారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏమిటి.. లేకుంటే ఏమిటి..? అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేపట్టిన హాత్‌సే హాత్ జోడో యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు జిల్లాలో కొనసాగింది. ఉదయం రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఆయన రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ములుగు జిల్లా కేంద్రం వరకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పలుచోట్ల ప్రజలు, రైతులతో ముచ్చటించారు. మీడియాతో, ములుగులో రాత్రి జరిగిన రోడ్‌షోలోనూ రేవంత్ (Revanth Reddy) మాట్లాడారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్‌ను లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు. అద్దాల మేడలలెక్క కలెక్టరేట్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ధరణి పేరిట లక్షలాది ఎకరాల భూములను కాజేస్తూ భూసమస్యలు పరిష్కరించని అద్దాల మేడలు ఉంటే ఏమిటి.. లేకుంటే ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
నేడు నర్సంపేటలో నిరసనలు
తెలంగాణ ప్రగతికి చిహ్నమైన ప్రగతి భవన్ (Pragathi Bhavan) ను గ్రెనేడ్ల తో పేల్చేయాలంటూ.. టీపీపీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి వాఖ్యలకు నిరసనగా నేడు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక పార్టమెంట్ సభ్యుడుగా ఉండి పరిపాలనా భవనం, తెలంగాణ ప్రగతికి చిహ్నమైన “ప్రగతి భవన్” ను గ్రెనేడ్స్ తో పేల్చేయమనటం హేయమైన చర్య ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాడు నక్సలిజాన్ని నిషేదించింది కాంగ్రేస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ నేడు నక్సలైట్లతో ప్రగతి భవన్ ను గ్రెనేడ్లతో పేల్చేయండి అనడాన్ని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వాఖ్యలు (Comments) చేసిన రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ క్రింద కేసుపెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
Also Read: Whats App: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. 30 కాదు 100 పంపొచ్చు!

Related News

Free Wi-Fi AC Sleeper Buses: తెలంగాణలో ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులు..!
ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్ బస్సులకు హైటెక్ హంగులను అద్దింది.