Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు మార్చేయనున్న రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి అయితే రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.
- By News Desk Published Date - 06:15 AM, Thu - 14 December 23

తెలంగాణలో(Telangana) రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎంగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం, మంత్రులు దూసుకెళ్తున్నారు. అన్ని శాఖల్లోనూ దూకుడు చూపిస్తున్నారు. అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ(Assembly) సమావేశాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు. అసెంబ్లీ రూపురేఖలు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ, మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం తిరిగి పరిశీలించి అనంతరం అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్ వరకు పూర్తిగా మారిపోవాలి అని తెలిపారు.
పార్లమెంటులా అసెంబ్లీని మార్చేయాలని, అసెంబ్లీ, మండలి కలిపి ఒకే బిట్ లా కనిపించేలా మార్పులు చేయాలని, పార్కింగ్, ల్యాండ్ స్కెప్ ల కోసం త్వరలో చర్యలు తీసుకోవాలని, పార్లమెంటును దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని, పార్లమెంటు వద్ద విజయ్ చౌక్ లా మార్పులు చేయాలని రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Dharani Portal : ధరణి పోర్టల్ లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు