Revanth Reddy@USA: డల్లాస్ లో రేవంత్ రెడ్డి…6వేల ఎకరాల వ్యవసాయ క్షేత్రం పరిశీలన..!!
టీపీసీపీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ NRIశాఖ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు.
- By hashtagu Published Date - 12:13 AM, Sat - 4 June 22

టీపీసీపీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ NRIశాఖ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం డల్లాస్ వెళ్లిన రేవంత్ రెడ్డి…అక్కడున్న ఓ భారీ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.
డల్లాస్ కు చెందిన మైక్ ఫల్లాన్ 6వేల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ ఫల్లాన్ తో ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే భేటీ అయ్యారు. ఫల్లాన్ అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. అక్కడి వ్యవసాయ విధానాలు, సాగుకు అయ్యే ఖర్చు, పంటల భీమా, సాగుకు అమెరికా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది ఓ మంచి అనుభవం అంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Visited farmer Mike Fallon in Dallas who is cultivating 6000 acres of land…I have taken a feed back on agricultural policies, costing, insurance, US Government support and viability..
Good experience… pic.twitter.com/KrfdnUn8TX
— Revanth Reddy (@revanth_anumula) June 2, 2022