Harish Rao: మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు
మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులకు పూర్తిగా మంత్రి సహకరించారు.
- By Balu J Published Date - 10:53 AM, Thu - 9 November 23
Harish Rao: మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులకు పూర్తిగా మంత్రి సహకరించారు. మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని జగిత్యాల జిల్లా కొండగట్టు రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీశ్ రావు పూర్తిగా సహకరించారు.
మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. నేడు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్న మంత్రి హరీశ్ రావు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం ఉదయాన్నే కొండగట్టుకు చేరుకున్నారు.