KCR Undavalli Meet : ఉండవల్లి మిస్ అయిన లాజిక్‌ను బయటపెట్టిన రేవంత్.. అదేంటంటే..
కేసీఆర్, ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచనలన వ్యాఖ్యలు చేశారు.
- Author : Hashtag U
Date : 14-06-2022 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
కేసీఆర్, ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచనలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి కేసీఆర్ హనీ ట్రాప్ లో పడ్డారని అన్నారు. తనకు ఉండవల్లి సమైక్యాంధ్ర సిద్దాంతం కోసం పోరాడారనే గౌరవం ఉండేదని… కేసీఆర్ పంచన చేరి భజన చేయడంతో తెలంగాణ ప్రజల్లో ఉండవల్లి కి గౌరవం పోయిందని రేవంత్ అన్నారు. కేసీఆర్ బీజేపీ పై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతి పై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అసలు ఇన్ని మాటలు మాట్లాడే ఉండవల్లి ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారని అన్నారు. రాష్ట్ర విభజన పై రెండు పుస్తకాలు రాసిన ఉండవల్లి, తెలంగాణ ఏర్పాటునే తప్పు బట్టారని, వాటిలో తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్ ను విమర్శించారని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ని కేసీఆర్ ఇంటికి పిలిచి కలసి పనిచేయమంటరాని ఫైర్ అయ్యారు రేవంత్.
ఇక కేసీఆర్ జాతీయ పార్టీపై కూడా రేవంత్ సెటైర్స్ వేశారు. సారా పాతదే..సీసా కొత్తది అన్నట్లు.. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నాడని అన్నారు. పక్కన బీహార్ వాళ్లను పెట్టుకున్న కేసీఆర్.. తన జాతీయ పార్టీకి బీహార్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుంటే బాగుండేదని అన్నారు. ఉండవల్లి అడ్డామీద కూలిగా మారి కేసీఆర్ తో కలవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ను వ్యతిరేకించిన ఉండవల్లి ని కేసీఆర్ దగ్గరకు తీస్తే..తెలంగాణ సమాజం ఊరుకోదని అన్నారు రేవంత్.