Revanth Reddy : గాంధీ హాస్పిటల్ కు రేవంత్ రెడ్డి…ఉద్రిక్త పరిస్థితి..!!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తుండగా...పోలీసులు అదుపులోకి తీసుకుని...ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
- By Bhoomi Published Date - 08:27 PM, Sat - 18 June 22

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తుండగా…పోలీసులు అదుపులోకి తీసుకుని…ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇవాళ సాయంత్రం ఆయన్ను పోలీసులు విడిచిపెట్టారు. అయితే సికింద్రాబాద్ ఘటన హింసాత్మకంగా మారగా…పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లా యువకుడు మరణించిగా…మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం గాంధీఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి వెనక గేటు నుంచి లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో గాయపడిన వారిని పరామర్శించి…వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Related News

Seasonal Diseases : హైదరాబాద్ ను వణికిస్తోన్న డెంగ్యూ, గ్యాస్ట్రిక్ వ్యాధులు
హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రులు వైరల్ జ్వర రోగులతో నిండిపోతున్నాయి. డెంగ్యూ, సీజనల్ జ్వరాలు నగర పౌరులను అల్లాడిస్తున్నాయి