KTR: కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మ తో కూడా కాదు: కేటీఆర్
- By Balu J Published Date - 05:31 PM, Wed - 1 May 24

KTR: తెలంగాణ భవన్ లో జరిగిన ‘మే’ డే వేడుకల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం పాత్ర మరవలేనిదని, సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో తమ సత్తా చాటారని, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మ తో కూడా కాదు అని, కాళేశ్వరం ప్రాజెక్ట్, బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, యాదాద్రి ఆలయం నిర్మాణంలో కార్మికుల శ్రమ ఉందని, కార్మికుల విషయంలో కేసీఆర్ గారి హృదయం చాలా గొప్పదని అన్నారు.
కరోనా సమయంలో కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతో ఇబ్బంది పడ్డారో మరిచిపోవద్దని, ఇదే మోడీ ప్రభుత్వం కార్మికులను చావ గొట్టింది? కార్మికుల కోసం రైళ్లు పెట్టమంటే మానవత్వం లేకుండా చేసింది ఈ మోడీ కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మోడీయే వ్యాక్సిన్ కనుగొన్నాడు అని కిషన్ రెడ్డి అంటున్నాడని, అసలు మనల్ని చావగొట్టనందుకే ఆయనకు ఓటు వేయాలంట అని కేటీఆర్ సెటైర్లు వేశారు.
మోడీ దేవుడని ఇంకొడు అంటాడు. దేనికి దేవుడు? అని, కార్మికులను, కర్షకులను చావ గొట్టిన్నందుకా? దేనికి మోడీ దేవుడా.. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గితే ఎందుకు పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగాయని, రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా ఉండేందుకు ప్రత్యేక సెస్ లు వేసిండని కేటీఆర్ మండిపడ్డారు.