News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Revanth Reddy Claims That Farmers Development Only By Congress

Revanth On Farmers: కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమం సాధ్యం-రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమన్నారు టీపీసీసీ చీఫీ రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు.

  • By Hashtag U Published Date - 10:32 PM, Fri - 6 May 22
Revanth On Farmers:  కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమం సాధ్యం-రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమన్నారు టీపీసీసీ చీఫీ రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు. హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆరెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రైతుల కుటుంబాలను కేసీఆర్ ఆగం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకేసారి రెండులక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు. ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం చేస్తామన్నారు. భూమిలేని కౌలు రైతులకు ఎకరానికి రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే…రైతులు పండించిన పంటలన్నింటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి…పసుపు రైతులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మరోవైపు ఇందిరమ్మ రైతు భరోసా పథకం అమలుచేయడంతోపాటుగా…అన్ని పంటలకు గిట్టబాటు ధరలు కల్పిస్తామన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పంటల బీమా అమలు చేసి నష్టపరిహారం వెంటనే అందిస్తామని చెప్పారు. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పోడు రైతులక పట్టాలు ఇస్తామని..పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటిని పూర్తి చేస్తామని చెప్పారు. చట్టపరంగా రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇక వరికి ప్రస్తుతం మద్దతు ధర రూ. 1960 ఉందని…క్వింటాల్ వడ్లను రూ. 2500చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పారు. పసుపు పంటను క్వింటాల్ కు 12వేల కొనుగోలు చేస్తామని వెల్లడించారు. మొక్క జొన్న పంటకు క్వింటాల్ కు రూ. 3500చెల్లిస్తామన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమం సాధ్యం అవుతుందన్నారు. వరంగల్ డిక్లరేషన్ హిస్టరీలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Rahul ji consoling the families of farmers who committed suicide…

Congress will wipe their tears & bring change in their lives.

Congress always with farmers. #raithusangarshanasabha pic.twitter.com/7jFkcgssRl

— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022

Tags  

  • revanth reddy
  • telangana congress
  • telangana farmers
  • warangal sabha

Related News

Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు..!

Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు..!

ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈడీ , సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ కుటుంబం బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు.

  • Revanth Reddy : రాహుల్ కీల‌క ఆదేశాలు..ఆట మొద‌లుపెట్టిన రేవంత్‌.. ఆ నేత‌ల‌పై వేటు?

    Revanth Reddy : రాహుల్ కీల‌క ఆదేశాలు..ఆట మొద‌లుపెట్టిన రేవంత్‌.. ఆ నేత‌ల‌పై వేటు?

  • Rahul Impact: రాహుల్ పర్యటనతో టీ కాంగ్రెస్ లో ఫుల్ జోష్

    Rahul Impact: రాహుల్ పర్యటనతో టీ కాంగ్రెస్ లో ఫుల్ జోష్

  • Cong On KTR: కేటీఆర్ పై మాణిక్కం ఠాగూర్ సెటైర్ మామూలుగా లేదుగా..!!

    Cong On KTR: కేటీఆర్ పై మాణిక్కం ఠాగూర్ సెటైర్ మామూలుగా లేదుగా..!!

  • Owaisi: రాహుల్.. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్ : ఒవైసీ

    Owaisi: రాహుల్.. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్ : ఒవైసీ

Latest News

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

  • TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్

  • AP Teachers : స‌మ్మె దిశ‌గా ఏపీ టీచ‌ర్లు

  • SA vs Ind: భారత్‌తో సీరీస్ కు సఫారీ టీమ్ ఇదే

  • Virus In SmartPhone: మీ స్మార్ట్ ఫోన్‌కు వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి…లేకపోతే హ్యాకర్ల చేతిలో మీ పని గోవిందా…?

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: