Telangana: 1000 ఎకరాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్.. మరి కేటీఆర్ ఫామ్ హౌస్?
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ లపై ఎకరాలతో సహా చెప్పారు.
- Author : Praveen Aluthuru
Date : 31-07-2023 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ లపై ఎకరాలతో సహా చెప్పారు. కేసీఆర్ కి 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నదని, కేటీఆర్ కు 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నదని తెలిపారు రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్ లు, టీవీ చానెళ్లు, న్యూస్ పేపర్లు, కంపెనీలు చాలానే ఉన్నాయని తెలిపారు. కెసిఆర్ మహబూబ్ నగర్ ని దత్తత తీసుకున్నాడని, అయితే కేసీఆర్ ఆస్తులు పెరుగుతున్నపటికీ మహబూబ్ నగర్ దుస్థితి మాత్రం మారట్లేదని విమర్శించారు రేవంత్.
కేసీఆర్ సీఎం అవ్వకముందు మహబూబ్ నగర్ ప్రజలు ఆయనను ఎంపీగా గెలిపించారని అయితే ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకుని తన ఇల్లు అమ్మైనా మహబూబ్ నగర్ ని అభివృద్ధి చేస్తానని నమ్మబలికిన కేసీఆర్, ఈ రోజు మాటను గట్టుమీద పెట్టి తన ఆస్తుల్ని పెంచుకుంటున్నాడని ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నిరవేర్చలేదని స్పష్టం చేశారు.
Also Read: రాశీఖన్నా పిక్స్‌పై నెటిజన్ల బోల్డ్ కామెంట్స్