HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Praises Modi

Revanth Reddy : మోడీకి ‘జై’ కొట్టిన రేవంత్..కానీ

Revanth Reddy : మోదీని తెలంగాణకు మిత్రుడిగా అభివర్ణించిన రేవంత్, అదే సమయంలో కిషన్ రెడ్డిని రాష్ట్రానికి శత్రువుగా చిత్రీకరించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది

  • Author : Sudheer Date : 03-03-2025 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Meets PM Modi
CM Revanth Meets PM Modi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ఆదివారం వనపర్తిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. మోదీ తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నారని అభిప్రాయపడిన రేవంత్, కిషన్ రెడ్డి మాత్రం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Mega DSC : మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

ప్రధాని మోదీపై రేవంత్ ప్రశంసలు గుప్పిస్తూ.. తెలంగాణ అభివృద్ధికి మోడీ ఆసక్తి చూపిస్తున్నారని, ప్రత్యేకంగా వరంగల్ ఎయిర్ పోర్టు మంజూరును ఉదహరిస్తూ, మోదీ రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, ఆయన సానుభూతి తెలంగాణపై ఉందని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మద్దతు లభిస్తే, రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన తెలిపారు.

అయితే, మోదీ తెలంగాణకు చేయాలనుకున్న పనులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉంటూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిపివేయడం, అభివృద్ధి ప్రాజెక్టులను విఫలమయ్యేలా చేయడం కిషన్ రెడ్డి కుయుక్తి అని అన్నారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్ పోర్టును మోదీ ఇచ్చినప్పటికీ, దాన్ని తన విజయంగా చిత్రీకరించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. అదే సమయంలో మెట్రో రైలు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు తేవడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని రేవంత్ విమర్శించారు.

VV Vinayak : వీవీ వినాయక్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీం.. చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరిక..

రేవంత్ తన రాజకీయ ప్రయాణంలో ఒకదశలో కిషన్ రెడ్డితో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తన ఎదుగుదలను కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తాను తనకంటే చిన్న వయసులో సీఎం అయ్యారనే అసూయతో కిషన్ రెడ్డి రాష్ట్రానికి మేలు చేసే పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీని తెలంగాణకు మిత్రుడిగా అభివర్ణించిన రేవంత్, అదే సమయంలో కిషన్ రెడ్డిని రాష్ట్రానికి శత్రువుగా చిత్రీకరించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • kishan reddy
  • modi
  • revanth Praises modi
  • revanth wanaparthy

Related News

CM Revanth Delivers Great News to Workers in Telangana

Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

తెలంగాణ కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనాల పెంపు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా వివరించారు. ఇక వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు కేటగిరీలుగా కార్మికులను విభజించి వ

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd