HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Plots To Drown Singareni

Lok Polls : సింగరేణిని ముంచేందుకు రేవంత్ కుట్రలు – కేసీఆర్

మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిన కాంగ్రెస్‌ .. ఇప్పుడు మరోసారి మోడీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 03-05-2024 - 11:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Rgm
Kcr Rgm

మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ అని ..ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు గులాబీ బాస్ కేసీఆర్. ఈసీ నిషేధం తర్వాత ఈరోజు సాయంత్రం 8 గంటలకు కేసీఆర్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్బంగా రామగుండంలో నిర్వహించిన రోడ్‌ షోలో కేసీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ , బిజెపి సర్కార్ లపై విమర్శలు కురిపించారు. సింగరేణి మన తెలంగాణ ఆస్తి అని.. వంద శాతం మనకే ఉండేదని , కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లోకి పంపించి.. ఆ అప్పు తిరిగి చెల్లించలేక 49 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ అప్పగించింది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఎన్నో లాభాలు తెచ్చామని గుర్తు చేసారు. డిపెండెంట్‌ ఉద్యోగాలను పునరుద్ధరించి.. 19 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చామని.. సింగరేణి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ( సిమ్స్‌ )పేరు మీద మెడికల్‌ కాలేజీ పెట్టుకున్నాం. ఆ మెడికల్‌ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేలా చేసుకున్నామని తెలిపారు. కానీ ఇప్పుడు సింగరేణికి పెద్ద ప్రమాదం రాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిన కాంగ్రెస్‌ .. ఇప్పుడు మరోసారి మోడీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు దీని గురించి ఆలోచించాలని.. కార్మికుల పక్షాన ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 200 సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్న‌ది. అర‌చేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల‌ని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి క‌ర్రుకాల్చి వాత‌పెట్టే స‌మ‌యం వ‌చ్చింది. బీఆర్ఎస్ బ‌లంగానే ఉంటేనే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు నెర‌వేరుస్త‌ది. కాబ‌ట్టి విజ్ఞ‌త‌తో ఆలోచించి బీఆర్ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Read Also : KCR: కాంగ్రెస్ త్వరలో భూస్థాపితం: కేసీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • Lok Sabha polls

Related News

The Bill Is Passed

Telangana Bill Passed : ‘ది బిల్ ఈజ్ పాస్డ్’ ఎమోషనల్ మూమెంట్ కు 12 ఏళ్లు

రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మార్చి 1వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లుపై రాజముద్ర వేశారు. దీంతో తెలంగాణ ఏర్పాటుకు చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014ను 'అపాయింటెడ్ డే'గా ప్రకటించింది

    Latest News

    • టీ- సిగరెట్ కలిపి తాగడం వల్ల ఏం జరుగుతుంది?

    • నేడు భార‌త్‌- జింబాబ్వే మ‌ధ్య మ్యాచ్‌.. ‘డ్యూ క్యూర్’ ఉప‌యోగం?!

    • Bhoodan Lands : అసలు ఏంటి ‘వెలుగుమట్ల’ భూముల వివాదం ? ఎక్కడ మొదలైంది ?

    • బ్రిటీష్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం.. 85 దేశాల‌కు త‌ప్ప‌నిస‌రి!

    • Vijay – Rashmika Wedding Food Menu : విజయ్-రష్మిక పెళ్లి విందులో అదరగొట్టిన తెలంగాణ వంటకాలు

    Trending News

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

      • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

      • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

      • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd