HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Is Crazy About Vastu Harish Rao

Telangana Secretariat : రేవంత్ కు వాస్తు పిచ్చి పట్టింది – హరీష్ రావు

Telangana Secretariat : గ్రీన్‌ టెక్నాలజీతో, ఫైర్‌ సేఫ్టీ నార్మ్స్‌ తో దేశానికే తలమానికంగా కేసీఆర్‌ కొత్త సెక్రటేరియట్‌ నిర్మిస్తే వాస్తు పిచ్చి అని గాయి గాయి.. గత్తర గత్తర చేసిన రేవంత్‌ రెడ్డి

  • Author : Sudheer Date : 07-11-2024 - 3:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Vasthupichhi
Revanth Vasthupichhi

సచివాలయం(Telangana Secretariat)లో మార్పులపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం రేవంత్ రెడ్డి వాస్తు (Vaastu Changes) పిచ్చితో సచివాలయంలో మార్పులు చేస్తూ ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని.. ఒక్క గేటు మార్పు కోసం ఏకంగా రూ.3.2కోట్ల దుబారా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

గ్రీన్‌ టెక్నాలజీతో, ఫైర్‌ సేఫ్టీ నార్మ్స్‌ తో దేశానికే తలమానికంగా కేసీఆర్‌ కొత్త సెక్రటేరియట్‌ నిర్మిస్తే వాస్తు పిచ్చి అని గాయి గాయి.. గత్తర గత్తర చేసిన రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వాస్తు పిచ్చితో సెక్రటేరియట్‌ లో పూటకో మార్పు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ మార్క్‌ మార్పు అంటే ఇదేనని.. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చేశారు. సెక్రటేరియట్‌ సింహద్వారం మార్పు, రెండు గేట్లను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తుండటంపై మండిపడ్డారు.

తెలంగాణ సచివాలయానికి సంబంధించి..సీఎం రేవంత్ వాస్తు మార్పులు చేయాలనీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈశాన్య దిశలో కొత్త గేట్‌ను నిర్మించేందుకు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.3.2 కోట్ల టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా సచివాలయపు బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి, గేట్ 3 ద్వారా ముఖ్యమంత్రి బయటికొచ్చేందుకు కొత్త మార్గం ఏర్పడుతుంది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు కొత్త రోడ్డు నిర్మాణం చేయబడుతుంది. అలాగే గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు మరో కొత్త గేటును ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తొలగించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నారు. ఈ మార్పులు చేయడాన్ని బిఆర్ఎస్ నేతలు తప్పు పడుతూ..ప్రజల సొమ్మును ఇలా వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : TRAVANCORE DEVASWOM BOARD: అయ్యప్ప భక్తులకు షాక్? ఇకపై ఇరుముడిలో ఇవి బ్యాన్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao
  • telangana secretariat . cm revanth
  • Vaastu changes

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

Latest News

  • రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు

  • కశ్మీర్‌లో భూకంపం

  • జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

  • ఇండియన్ నేవీలో 260 పోస్టులు

  • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd