HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Becomes Congress Ek Nath Shinde Ktr Fires On Cm

KTR: రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడు, సీఎంపై కేటీఆర్ ఫైర్

  • Author : Balu J Date : 20-01-2024 - 1:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Revanth
Ktr Revanth

KTR: హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డికి సూచించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందని అన్నారు.

‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్ … తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా. కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయి. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడు. రేవంత్ రక్తం అంత బిజెపిదే…ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.

‘‘జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు. స్వయంగా ముఖ్యమంత్రి…. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పిండు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10జన్ పత్ కు పంపించాలి. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలి. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

‘‘కెసిఅర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిప్ట్ లను జాతికి అకింతం చేశారు. ఇదే అయన చేసిన అతిపెద్ద పని. బీఅర్ఎస్ కెసిఅర్ అద్వర్యంలో 36 ప్లైఒర్లు కడితే, ఉప్పల్, అంబర్ పేట ప్లై ఒవర్లు సంవత్సరాలైనా కట్టలేక చేతులెత్తెశారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజాపక్షమే’’ అని కేటీఆర్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • cm revanth
  • hard comments
  • ktr

Related News

Cm Revanth Good News

Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

18 ఏళ్లు నిండిన అర్హులైన విద్యార్థినులకు ఈ స్కూటర్లను పంపిణీ చేయడం ద్వారా వారి ఉన్నత చదువులకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ, త్వరలోనే దీనిపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించి

  • There Will Be No Urea Probl

    Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!

  • Telangana Congress Nominate

    Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ నుండి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

  • Revanth Vem

    Rajyasabha : వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్..? సీఎం రేవంత్ మాట నెగ్గుతుందా ?

  • Telangana Congress Govt Sch

    Govt Schemes : వారందరికీ ప్రభుత్వ పథకాలు కట్ – కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!

Latest News

  • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

Trending News

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd