Hyderabad : ‘హైడ్రా’ దెబ్బ కు తలలు పట్టుకుంటున్న రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు
ఇప్పుడు కొత్తగా ఫ్లాట్స్ కొనాలంటే కొనుగోలుదారులు భయపడుతున్నారు. ఏ నాలా ఫైన కట్టారో..? ఎప్పుడు నోటీసులు వస్తాయో..? అని ఖంగారుపడుతున్నారు
- By Sudheer Published Date - 09:23 PM, Fri - 30 August 24

హైదరాబాద్ లో హైడ్రా దూకుడుతో రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు తలలుపట్టుకుంటున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (Hydra) వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..తాజాగా వందలమందికి నోటీసులు జారీ చేసారు. ఇందులో అధికార పార్టీ నేతలు, సినీ ప్రముఖులు , బిజినెస్ రంగంవారు ఇలా చాలామందే ఉన్నారు. దీంతో ఇప్పుడు కొత్తగా ఫ్లాట్స్ కొనాలంటే కొనుగోలుదారులు భయపడుతున్నారు. ఏ నాలా ఫైన కట్టారో..? ఎప్పుడు నోటీసులు వస్తాయో..? అని ఖంగారుపడుతున్నారు. కొత్తగా ఫ్లాట్స్ కొనాలనుకునేవారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటుండగా..చెరువులు, నాలాల చుట్టూ నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారు వాటిని రద్దు చేసుకోవడం మొదలుపెట్టారు. అడ్వాన్సులు వెనక్కి తిరిగి ఇచ్చేయాలని డెవలపర్లు, కాంట్రాక్టర్లను కోరుతున్నారు. ముఖ్యంగా అమీన్పూర్ లేక్, దుర్గంచెరువు, గండిపేట ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు చెపుతున్నారు. హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ ఫై ప్రభావం గట్టిగా పడనుందని అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోగా..ఇప్పుడు హైడ్రా దెబ్బ తో మరింత పడిపోవడం ఖాయమని భావిస్తున్నారు.
Read Also : Uttam Kumar : దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఉత్తమ్