TGSWREIS : బాబోయ్..హాస్టల్స్ లలో ఎలుకలు స్వైర విహారం..ఉండలేకపోతున్నాం
కలుషిత ఆహారం పెట్టడం..ఇంకొంతమంది అర్ధరాత్రి మద్యం సేవించి కొట్టడం ,తిట్టడం చేస్తున్నారు. ఈ ఘటనలే అనుకుంటే ఎలుకలు కూడా విద్యార్ధులపై దాడికి దిగుతున్నాయి.
- By Sudheer Published Date - 05:13 PM, Thu - 11 July 24

ప్రభుత్వ గురుకుల హాస్టల్స్ ( T.G Social Welfare Residential Schools) లలో విద్యార్థులను ఉంచాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు. ప్రవైట్ స్కూల్స్ , హాస్టల్స్ లలో ఉంచి చదివించే స్థోమత లేని పేదవారు..ప్రభుత్వ స్కూల్స్ , హాస్టల్స్ లలో చేర్పించితే అక్కడ ఉపాధ్యాయులు , సిబ్బంది మాత్రం చిన్న చూపు చూడడం..కలుషిత ఆహారం పెట్టడం..ఇంకొంతమంది అర్ధరాత్రి మద్యం సేవించి కొట్టడం ,తిట్టడం చేస్తున్నారు. ఈ ఘటనలే అనుకుంటే ఎలుకలు కూడా విద్యార్ధులపై దాడి (Rats Attack)కి దిగుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఘటన మెదక్ జిల్లాలోని రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో చోటుచేసుకున్నాయి. ఒకరిద్దరిని కాదు ఏకంగా 12 మందిఫై ఎలుకలు దాడి చేసి..గాయపడిచాయి. బాధిత విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన ఫై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకలు సంచరిస్తూ, నిద్రిస్తున్న సమయంలో తమను కొరుకుతున్నాయని ఇప్పటికే పలుమార్లు ప్రిన్సిపాల్‌కు విద్యార్థినులు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గడిచిన బిఆర్ఎస్ హయాంలో ఇలాంటివి జరగలేదని వాపోతున్నారు. ఈ ఘటనే కాదు ఇటీవల హాస్టల్స్ లలో జరుగుతున్న వరుస ఘటన ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు.
జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టెలుక’ అనే వార్తా క్లిప్పింగ్‌ను ఆయన జోడిస్తూ… కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి.. పురుగుల అన్నం.. నీళ్ల చారు.. ఈనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి.. బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు అంటూ ఎద్దేవా చేశారు.
మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదంతమైందని… నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి 20 మంది విద్యార్థులకు వాంతులు చేసుకున్నారని గుర్తు చేశారు. సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో ఇక్కడి విద్యార్థులు బెంబేలెత్తారన్నారు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు?? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ??? అని ప్రశ్నించారు. కలుషిత ఆహారం వల్ల… పిల్లలు ఆడుకోవాల్సిన వయస్సులో ఆసుపత్రుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Telangana Assembly Session : ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు