Telangana Assembly Session : ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈసారి అసెంబ్లీ సమావేశాలు కాకా రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు అయ్యి..ఆరు నెలలు పూర్తయినప్పటికీ ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
- By Sudheer Published Date - 04:34 PM, Thu - 11 July 24

ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly session) ప్రారంభం కాబోతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు ప్రభుత్వ విప్‌లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్‌తో పాటు పలువురు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం రైతు భరోసా (Rythu Bharosa) విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, జాబ్ క్యాలెండర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే.. గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కానీ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరి ఈ సమావేశాలు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు కాకా రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు అయ్యి..ఆరు నెలలు పూర్తయినప్పటికీ ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రస్తుతం అమలు చేసిన పథకాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందలేదు. అయితు భరోసా , రుణ మాఫీ , జాబ్ క్యాలెండర్, మహిళకు రూ.2500 అందజేత ఇలా ఎన్నోహామీలు అలాగే ఉండిపోవడం తో వాటిపై ప్రతిపక్ష పార్టీలు..అధికార పార్టీ ని కడిగిపారేయడం ఖాయం. మరి వీటికి కాంగ్రెస్ ఎలాంటి సమాదానాలు చెపుతుందో చూడాలి.
Read Also : Ram Charan Cars : రామ్ చరణ్ దగ్గర మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? వాటి విలువ కోట్లల్లో..