TGRTC కి కలిసొచ్చిన రాఖీ పండగ
రక్షాబంధన్ పర్వదినం నాడు టీజీఎస్ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. సోమవారం నాడు 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయి
- Author : Sudheer
Date : 20-08-2024 - 4:17 IST
Published By : Hashtagu Telugu Desk
రాఖీ పండగ TGRTC కి బాగా కలిసొచ్చింది. రాఖీ అంటేనే మహిళల పండగ..అలాంటి మహిళా పండగను..మహిళలు ఫ్రెస్ బస్సు ద్వారా గట్టిగా వాడుకున్నారు. గతంలో ఇంట్లో ముగ్గురు , నలుగురు ఉంటె తమ సోదరుడికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వెళ్లి రాఖీ కట్టేవారు కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు పుణ్యమా అని ఇంట్లో నలుగురు ఉంటె నలుగురు వెళ్లి తమ సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమను పంచుకున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువగా మహిళలు రాఖీ రోజు ఉచిత బస్సు ను వాడుకున్నట్లు MD సజ్జనార్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
”రక్షాబంధన్ పర్వదినం నాడు టీజీఎస్ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. సోమవారం నాడు 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయి. ఒక్కరోజులో మొత్తంగా 63 లక్షల మంది వరకు ప్రయాణించగా.. అందులో అత్యధికంగా రీజియన్ల వారీగా హైదరాబాద్ 12.91 లక్షలు, సికింద్రాబాద్ 11.68 లక్షలు, కరీంనగర్ 6.37 లక్షలు, మహబుబ్‌నగర్ 5.84 లక్షలు, వరంగల్ 5.82 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేశాయి. 97 డిపోలకు గాను 92 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్)ను నమోదు చేశాయి. రాఖీ నాడు రికార్డు స్థాయిలో 32 కోట్ల వరకు రాబడి వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డు.” అని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
Read Also : T20 World Record: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు, 39 పరుగులు