Radisson Drugs Case : రాడిసన్ డ్రగ్స్ కేసులో కేటీఆర్ బావమరిది ఫై ఆరోపణలు
- Author : Sudheer
Date : 01-03-2024 - 11:12 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ (Radisson Drugs Case) కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో వారికి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా.. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల (Rajendra Prasad Pakala) అలియస్ రాజ్ పాకాల పేరు సైతం బయటకు రావడం వార్తల్లో హైలైట్ అవుతుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజ్ రకరకాల పేర్లతో గచ్చిబౌలిలో పార్టీలు నిర్వహించేవారని ఆయన ఫై ఆరోపణలు వస్తున్నాయి. అధికార ప్రభుత్వం చేతిలో ఉండడం తో రాజ్ పాకాల ఇలా గుట్టుచప్పుడు కాకుండా చేసేవారని అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడం తో రాజ్ పేరు బయటకు తీసారని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. మరోపక్క తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని , కావాలనే తన పేరును బయటకు తీస్తున్నారని రాజ్ వాపోతున్నారు. కేటీఆర్ బంధువు కావడం తో తనను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. చూద్దాం ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయో..
Read Also : BRS : తెలంగాణ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలు