HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rains In Telangana For Two More Days Rains

Rains : తెలంగాణలో ఇంకో రెండు రోజులు వర్షాలే..వర్షాలు

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది

  • Author : Sudheer Date : 20-07-2024 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Major changes in the Bay of Bengal... A barrage of lightning strikes expected in the coming days.
Major changes in the Bay of Bengal... A barrage of lightning strikes expected in the coming days.

గత నాల్గు రోజులుగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో భారీ వర్షాలు (Rains) కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల దాటికి వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల చెరువులు తెగి పలు ఊర్లను ముంచెత్తుతున్నాయి. ఇక రవాణా వ్యవస్థ కూడా స్థంభించింది. స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుందని.. పూరికి 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కదులుతూ 12గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గడిచిన 24గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ఇక హైదరాబాద్ (Hyderabad) లో నిన్న రాత్రి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అక్కడ, ఇక్కడ అని లేకుండా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Read Also : Kaleshwaram Project : గోదావరిలో..కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి – కేటీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • rains
  • telangana

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd