Mancherial : గొడుగులతో పాఠాలు వింటున్న విద్యార్థులు.. ఆ స్కూలులో దయనీయ పరిస్థితి
విద్యార్థులకు చదువులు బాగా రావాలంటే.. స్కూలులో కనీస సౌకర్యాలు ఉండాలి.
- By Pasha Published Date - 01:24 PM, Thu - 25 July 24

Mancherial : విద్యార్థులకు చదువులు బాగా రావాలంటే.. స్కూలులో కనీస సౌకర్యాలు ఉండాలి. వర్షాలు కురిసినప్పుడు తరగతుల నిర్వహణకు ఆటంకం కలగకూడదు. కానీ మంచిర్యాల జిల్లా(Mancherial)నెన్నెల మండలం కుశ్నపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో దారుణ పరిస్థితి నెలకొంది. అక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు సరిగ్గా లేదు. దీంతో వర్షం కురిస్తే.. తరగతి గది అంతా చిత్తడిచిత్తడిగా మారుతోంది. దీంతో విద్యార్థులు గొడుగులు పట్టుకొని కూర్చొని పాఠాలు వింటున్నారు. వర్షాలలో ఈవిధంగా తడిస్తే విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవిషయం తెలిసినా జిల్లా విద్యాశాఖ యంత్రాంగం పాఠశాల భవనానికి(Raining in Classroom) కనీస మరమ్మతులు చేయించడంపై ఫోకస్ పెట్టడం లేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Umbrellas inside the classroom … Symbolic protest by students of Zilla Parishad High School #KushnapalliVillage #Mancherial #Telangana; young smiling faces but situation is grim & could pose physical danger; Certainly this is not how a school should be @TelanganaCMO @TSEduDept pic.twitter.com/PYKb6go2Op
— Uma Sudhir (@umasudhir) July 25, 2024
We’re now on WhatsApp. Click to Join
వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఈ స్కూలులోని వివిధ తరగతి గదుల్లో ఉపాధ్యాయులు కూడా గొడుగులు పట్టుకొని.. పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. గతంలో ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం ద్వారా ఈ స్కూలులోని తరగతి గదులకు రూ.2 లక్షలతో మరమ్మతులు చేయించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. రిపేర్లు చేసిన కొన్ని నెలలకే మళ్లీ స్కూలు భవనం శిథిలావస్థకు గురైంది. ఆనాడు నాణ్యంగా మరమ్మతులు చేయకపోవడం వల్లేు ఈ దుస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read :Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ రూ.2,91,159 కోట్లు.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.91 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రోడ్లు భవనాల శాఖకు రూ.5,790 కోట్లు కేటాయించారు. విద్యాశాఖకు రూ.21,292 కోట్లు కేటాయించారు. కనీసం ఈ నిధులలో కొన్ని కేటాయంచైనా కుశ్నపల్లి జిల్లా పరిషత్ పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ బడ్జెట్‌లో సంక్షేమ శాఖకు రూ. 40 వేల కోట్లు, హోం శాఖకు రూ.9,564 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి ఉచిత రవాణా పథకానికి రూ.723 కోట్లు, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,836 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.29,816 కోట్లు, మహిళా శక్తి క్యాంటీన్లకు రూ.50 కోట్లు కేటాయించారు.