KGF On Rahul Gandhi: జోడో యాత్రలో ‘కేజీఎఫ్’ పాటలు.. రాహుల్ పై కేసు నమోదు!
రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి సూపర్ హిట్ సినిమా పాటలను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది.
- By Balu J Published Date - 01:02 PM, Sat - 5 November 22

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి సూపర్ హిట్ సినిమా పాటలను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. పాటల సాహిత్యం తరచుగా పొలిటికల్ ప్రచారంలో వినిపిస్తోంది. అయితే ఆడియో హక్కుల కోసం ఆయా మ్యూజిక్ కంపెనీల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న భారత్ జోడో యాత్రకు కేజీఎఫ్ పాటలను వినియోగించినందుకు గాను రాహుల్ గాంధీపై బెంగళూరు పోలీసులు కాపీరైట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
KGF2 బీజీఎం వాడినందుకుగానూ MRT మ్యూజిక్ రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా సినిమా పాటలను ఉపయోగించాడని పేర్కొంది. MRT మ్యూజిక్ అనుమతి/లైసెన్స్ తీసుకోకుండానే రాహుల్ గాంధీ కేజీఎఫ్ థిమ్ సాంగ్ వాడుకున్నారని ఆరోపించింది. అయితే దేశవ్యాప్తంగా ఎక్కువగా జనాదరణ పొందిన KGF పాటలను ఉపయోగించమని జోడో బృందం రాహుల్ గాంధీకి సూచించి ఉండవచ్చు. కానీ ఈ తాజా ఘటనతో రాహుల్ గాంధీకి షాక్ తగిలినట్టయింది.
https://twitter.com/INCIndia/status/1579838167217188865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579838167217188865%7Ctwgr%5E87975f93c21cfbb76e68b47343125e1bf0e74365%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fmrt-music-files-copyright-infringement-case-against-congress-kgf-2-movie-songs-2293381-2022-11-04