Rahul ‘pothuraju’ avatar: పోతురాజు` అవతారమెత్తిన రాహుల్
భారత్ జోడో యాత్రలో `పోతురాజు` అవతారం ఎత్తారు రాహుల్ గాంధీ. కొరఢాతో కొట్టుకుని జనాన్ని ఆకర్షించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతి రోజూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ అన్ని వర్గాలతో మమేకమవుతున్నారు. భారత్ జోడో యాత్ర 57వ రోజు సంగారెడ్డి వద్ద కొనసాగుతోంది.
- Author : CS Rao
Date : 03-11-2022 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ జోడో యాత్రలో `పోతురాజు` అవతారం ఎత్తారు రాహుల్ గాంధీ. కొరఢాతో కొట్టుకుని జనాన్ని ఆకర్షించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతి రోజూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ అన్ని వర్గాలతో మమేకమవుతున్నారు. భారత్ జోడో యాత్ర 57వ రోజు సంగారెడ్డి వద్ద కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ 57వ రోజు యాత్ర ను గురువారం ఉదయం 6 గంటలకు రుద్రారం వద్ద ఉన్న గణేష్ ఆలయం నుంచి బయలుదేరి సంగారెడ్డిలోని హనుమాన్ నగర్ వరకు కొనసాగిది. ఉదయం 10 గంటలకు విరామం తీసుకున్నారు. తెలంగాణ బోనాల పండుగలో కీలక పాత్రధారి అయిన పోతురాజుగా రాహుల్ గాంధీ బరువైన తాడుతో కొరడా ఝుళిపించారు.
రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్వహించారు. యాత్రలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోతురాజు నుంచి తాడు తీసుకుని కొరడా ఝుళిపించగా, ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా ఆయనతో కలిసి కొరడా ఝుళిపించారు.