Nagarjuna : మొన్న సురేఖ..నేడు రఘునందన్..నాగ్ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్..?
Raghunandan Rao : నాగార్జున మాజీ కోడలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని, ఆమెకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియదని రఘునందన్ ఎద్దేవా చేశారు
- By Sudheer Published Date - 04:04 PM, Mon - 7 October 24

సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna ) పై అలాగే ఆయన మాజీ కోడలు సమంత పై రాజకీయ పార్టీల నేతలు టార్గెట్ చేయడం పై అభిమానులు , సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ లో చాల కూల్ పర్సన్ అంటే నాగార్జునే అని ప్రతి ఒక్కరు చెపుతారు. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తన సినిమాలు ఏంటో..తన బిజినెస్ ఏంటో అంతే తప్ప ఒకరిపై విమర్శలు చేయడం కానీ..వివాదాల్లో నిలువడం కానీ ఆయన చేయడు. మీడియా తో కూడా చాల క్లోజ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తి ని ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు టార్గెట్ చేయడం పై సర్వ్త్ర చర్చ నడుస్తుంది. మొన్నటికి మొన్న మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ..దారుణమైన వ్యాఖ్యలు చేయగా..నేడు బిజెపి ఎంపీ రఘునందన్ (MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి, వారికి డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేశాడని కొండా సురేఖ చెప్పుకొచ్చారు..ఇదే సందర్బంగా హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడానికి కేటీఆరే కారణమని , సమంత – అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడం వెనుక కేటీఆర్ హస్తం ఉందని సురేఖ పెద్ద బాంబ్ పేల్చింది. కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు, సినీ పరిశ్రమ తీవ్రంగా ఖండించాయి. ఇదే క్రమంలో సురేఖ పై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. ఇది కోర్ట్ లో నడుస్తుంది.
ఇదిలా ఉండగా..బీజేపీ నేత రఘునందన్ రావు .. సమంత (Samantha)పై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేయడంపై రఘునందన్ మాట్లాడుతూ.. నాగార్జున మాజీ కోడలు, హీరోయిన్ సమంతను లాగారు. ఎన్ కన్వెన్షన్ ఉన్న ప్రాంతాన్ని సర్వే చేయాలని 2014లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పిందని, న్యాయస్థానం ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ 2016లో నివేదికను సమర్పించిందని , దీని ప్రకారం మూడున్నర ఎకరాల ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌ను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారని హెచ్ఎండీఏ తెలిపిందని ఆయన వెల్లడించారు. మరి 2016 నుంచి నేటి వరకు ఎన్ కన్వెన్షన్‌ను ఎందుకు కూలగొట్టలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇంతలో నాగార్జున మాజీ కోడలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని, ఆమెకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియదని రఘునందన్ ఎద్దేవా చేశారు. ఆ సంబంధాలు ఏంటో వాళ్లే చెప్పాలని.. వాళ్లకు ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వాళ్లు చెబితేనే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రఘునందన్ చేసిన వ్యాఖ్యలపై అంత మాట్లాడుకుంటున్నారు.
ఇలా వరుసగా రాజకీయ నేతలు నాగార్జున ఫ్యామిలీ ని టార్గెట్ చేయడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ ఎలాంటి తప్పు చేయలేదా..? వేలాది భూములు కబ్జా చేయలేదా..? చెరువులు , కుంటలు కబ్జా చేసి కాలేజీలు , హాస్పటల్స్ నిర్మించలేదా..? అని అంత విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి హైదరాబాద్ కు వచ్చి అక్కినేని ఫ్యామిలీ ఎన్నో ఏళ్లు గడుస్తున్నా..ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వారిని వివాదాల్లోకి లాగలేదు కానీ ఇప్పుడు మాత్రం వివాదాల్లోకి లాగుతున్నారని ఆరోపిస్తున్నారు.
Read Also : Nobel Prize 2024 : విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజ్