MLA Vivekananda : కేసీఆర్ తోనే నేను – ఎమ్మెల్యే వివేకానంద క్లారిటీ
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ముందు తానే వేశానని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్నారు. తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు
- By Sudheer Published Date - 02:34 PM, Mon - 15 July 24

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Congress Party)..బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫై పూర్తి ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హావ స్పష్టంగా కనిపిస్తే..గ్రేటర్ లో మాత్రం కారు హావ నడిచింది. దీంతో గ్రేటర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫై ఫోకస్ చేసాడు రేవంత్ (CM Revanth Reddy). వరుస పెట్టి ఆఫర్లు ప్రకటిస్తూ వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నాడు. ఇప్పటీకే దానం నాగేందర్ , ప్రకాష్ గౌడ్ , అరికపూడి గాంధీ వంటి వారు చేరగా ..మరికొంతమంది గ్రేటర్ ఎమ్మెల్యేలు చేరేందుకు ముహుర్తాలు ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. వీరి లో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ( Quthbullapur MLA Vivekananda) కూడా ఉన్నారని..ఈయన కూడా అతి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న నేపథ్యంలో..వివేకానంద క్లారిటీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ముందు తానే వేశానని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్నారు. తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పేర్లు మార్చడమే తప్పా ఏం పనులు చేయాలో తెలియడం లేదన్నారు. జీహెచ్ఎంసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ గొప్ప వ్యవస్థగా తయారు చేసిందని , ఇప్పుడు కొత్తగా’ హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కొత్త మునిసిపాలిటీలను అప్‌గ్రేడ్ కాకుండా సర్కార్ కుట్రలు చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ చేసిన మునిసిపాలిటీలను తొలగించే కుట్ర జరుగుతోందని , ‘హైడ్రా’ వెనుక ఏ లక్ష్యం లేదని.. కేవలం కుట్ర మాత్రమే ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆరు నెలలోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా పడిపోయే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలల్లో కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వక.. రియల్ ఎస్టేట్ కుదలైందని వివేకానంద తెలిపారు. అదేవిధంగా తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో ఎవరికి రాని మెజారిటీ తనకే వచ్చిందని అన్నారు. తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయబోనని అన్నారు. ఇక ముందు కూడా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని స్పష్టం చేసారు.
Read Also : Hyderabad-Warangal Highway: ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటితే ఇలాగే ఉంటుంది, క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి