HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Priyanka Gandhi Seeks To Boost Telangana Congress

Priyanka Gandhi: ప్రియాంక పూర్వ వైభవం తీసుకొచ్చేనా!

తెలంగాణా కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నికలోనూ గెలిచే పరిస్థితి కనబడటంలేదు.

  • Author : Balu J Date : 20-08-2022 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Priyanka Gandhi
Priyanka Gandhi

తెలంగాణా కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నికలోనూ గెలిచే పరిస్థితి కనబడటంలేదు. ఉప ఎన్నికల్లో పార్టీ పోరాడటం కంటే పార్టీలో నాయకుల పోరాటం ఎక్కువగా ఉంది. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం కష్టమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అదే కనుక జరిగితే రేవంత్ రెడ్డికి ఉద్వాసన చెప్పడం ఖాయంలా కనబడుతోంది. సీనియర్లలో చాలామంది రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీ గెలుపుకోసం వీళ్ళు ఎంతవరకు పనిచేస్తారో చెప్పలేం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ వ్యతిరేకులు చాలామంది బయటపడి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. చివరకు పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాకూర్ ను కూడా లెక్క చేయడంలేదు. రేవంత్ ను ఇంటికి పంపాలని కొందరు నాయకులు గట్టి పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పదవులు పోగొట్టుకోవడం చాలా సాధారణ విషయం. రేవంత్ రెడ్డి కూడా అందుకు అతీతుడేమీ కాదు.

మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఓ దశలో ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఆయన ఇప్పటికీ పార్టీకి కొరకరాని కొయ్యగానే ఉన్నారు. పార్టీలో అంతర్గత అంశాలపై అధిష్టానం పిలిచి మాట్లాడాలని సీనియర్ నాయకుడు వీహెచ్ అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి ఆవేదన చెందుతున్నాడని,  దాన్ని అధిష్టానం సరిదిద్దాలని సూచించారు. అయితే.. నన్ను కూడా గతంలో తిట్టారు.. అవమాన పరిచారన్న హనుమంతరావు.. హైకమాండ్ ఆలోచన  చేయాలన్నారు. సమావేశాలు పెట్టి మాట్లాడే అవకాశం ఇస్తే  అక్కడ మాట్లాడ వచ్చని, మీటింగులు పెట్టకపోతే బయట మాట్లాడతారన్నారు. మునుగోడు లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన అభ్యర్ధిని పెడితే మంచిదని హనుమంతరావు హితవు పలికారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోనియా గాంధీ కలవాలని నిర్ణయించుకున్నారు.

రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరించడంతో పాటు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానక పరిస్థితుల గురించి తెలియజేయడం కోసం సోనియా వద్దకు వెళ్తున్నానని, అందుకే ఆమె అపాయింట్‌మెంట్ కోరానని అన్నారు. ఇదే సమయంలో.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. అందుకు ఒక కండీషన్ పెట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పగిస్తేనే, ప్రచానికి వస్తానని ఆయన అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎదురుగా మునుగోడు టార్గెట్ ఉన్నప్పటికీ నేతల మారడంలేదు.తమకు దక్కాల్సిన పదవిని రేవంత్ రెడ్డి తన్నుకుపోయాడని చాలామంది నాయకులకు కోపంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్ళిపోయాక వారంతా కసి తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే …. పార్టీకి ఉన్న కీలక ఆయుధాల్లో ప్రియాంకా గాంధీ ఒకరు. ఆమెను యూపీ ఎన్నికల్లో రంగంలోకి దించినా ఆశించిన ఫలితాలు రాలేదు. 400 అసెంబ్లీ సీట్లుండగా కాంగ్రెస్ రెండు చోట్లే గెలిచింది. యూపీ ఎన్నికల్లో ఆమె ప్రభావం చూపించలేదు. అలాంటి ప్రియాంకకు తెలంగాణా బాధ్యతలు అప్పగిస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగినా తెలంగాణా కాంగ్రెస్ నాయకుల్లో మార్పు వస్తుందని ఆశించలేం. ఆమె బాధ్యతలు తీసుకున్నా  పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కష్టమే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • PCC Chief revanth reddy
  • PRIYANKA GHANDHI
  • TCongress
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd