Modi Tour Postponed: మోడీ ‘తెలంగాణ’ పర్యటన వాయిదా!
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
- By Balu J Published Date - 01:31 PM, Wed - 11 January 23

భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తెలంగాణలో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. జనవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ (Hyderabad) లో పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అయితే మోడీ పర్యటన వాయిదా పడినట్టు బీజేపీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రధాని కార్యాలయం సవరించిన తర్వాత మరో కొత్త తేదీని తెలియజేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని తన పర్యటనలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోడీ (PM Modi) ప్రారంభించాల్సి ఉంది.
ఈ నెల 19న ప్రధాని మోదీ ముంబయికి వెళుతున్నారు. హైదరాబాద్ పర్యటనను వచ్చే నెలలో ఏర్పాటు చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ, రాష్ట్ర పార్టీలో కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పర్యటన వాయిదా పడిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర పార్టీ నుంచి కొంతమందిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశముందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. దానికి సంబంధించిన మార్పుచేర్పుల కోసమే ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడిందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. అధికార వర్గాలు మాత్రం ప్రధాని బిజీ షెడ్యూలు వల్లే హైదరాబాద్ రాలేకపోతున్నారని చెబుతున్నారు.