Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తుంటారు.
- By Balu J Published Date - 06:20 PM, Wed - 13 December 23

Draupadi Murmu: ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఆమె తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోని, తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎస్. ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ రవి గుప్తా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, హెల్త్ సెక్రటరీ రిజ్వి, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read: Uttam Kumar: సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్