Uttam Kumar: సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్
- By Balu J Published Date - 06:14 PM, Wed - 13 December 23
Uttam Kumar: కాంగ్రెస్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. సోనియాతో భేటీపై ఆయన స్పందిస్తూ.. ఎలాంటి రాజకీయాల గురించి చర్చించలేదని, మర్యాదపూర్వకంగానే భేటీ జరిగిందని చెప్పారు. సోనియాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఉత్తమ్ మీడియాతో ముచ్చటించారు. అసలు మీటింగ్ ఏంటని ప్రశ్నించగా.. సోనియాతో పాటు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు.
సమావేశంలో రాహుల్ గాంధీ ఏం చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ ను మీడియా ప్రశ్నించింది. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించే అవకాశం ఉందని సమాచారం.